ఆర్‌సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌కి కరోనా... ఐపీఎల్ 2021పై కమ్ముకుంటున్న నీలినీడలు...

Published : Apr 04, 2021, 09:34 AM IST
ఆర్‌సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌కి కరోనా... ఐపీఎల్ 2021పై కమ్ముకుంటున్న నీలినీడలు...

సారాంశం

వాంఖడే స్టేడియంలో గ్రౌండ్‌మెన్‌ సిబ్బందికి కరోనా... నితీశ్ రాణా, అక్షర్ పటేల్ తర్వాత మరో స్టార్ ప్లేయర్‌కి పాజిటివ్... కరోనా పాజిటివ్‌ తేలిన ఆర్‌సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్...

ఐపీఎల్ 2021 సీజన్‌పై ఆరంభానికి ముందే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో 8 మంది గ్రౌండ్‌మెన్‌కి కరోనా పాజిటివ్ రాగా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

తాజాగా ఆర్‌సీబీ యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కూడా కరోనా సోకినట్టు తెలిసింది. 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఎంట్రీ ఇచ్చిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్, అద్భుతంగా రాణించి ఆర్‌సీబీ తరుపున లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఎంట్రీ సీజన్‌లోనే ఐదు హాఫ్ సెంచరీలు బాదిన దేవ్‌దత్ పడిక్కల్ కరోనా బారిన పడడంతో మొదటి రెండు లీగ్ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడం అనుమానమే. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా కొనసాగుతానని ప్రకటించడంతో అతనితో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారో చూడాలి...

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
KL Rahul : రోహిత్, కోహ్లీ ఫెయిల్.. రాజ్‌కోట్‌లో రాహుల్ రఫ్ఫాడించాడు.. సిక్సర్‌తో సెంచరీ