
సీజన్లు మారుతున్నా, ప్రీతి జింటా జట్టు పంజాబ్ రాత మాత్రం మారడం లేదు. ఎంత మంది కెప్టెన్లను మార్చినా, ఎన్ని జెర్సీ డిజైన్ మార్చినా సక్సెస్ మాత్రం పంజాబ్ తలుపు తట్టడం లేదు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం మరోసారి జెర్సీని మార్చింది పంజాబ్ కింగ్స్. అయితే మంగళవారం విడుదల చేసిన ఈ జెర్సీపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జెర్సీకి మరింత ఎరుపు రంగును జోడించి, అంచుల్లో గోల్డ్ కలరింగ్‌తో చారలు ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ లోగోను కూడా ముద్రించిన ఈ జెర్సీ చూస్తుంటే... అనిల్ కుంబ్లే సారథ్యంలో 2008 సీజన్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీకి గుర్తుకు వస్తోంది.
బెంగళూరులో ఎక్కువ మ్యాచులు ఆడుతున్నామనే ఉద్దేశంతో ఆర్‌సీబీ జెర్సీని, పంజాబ్ కాపీ కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు... గత సీజన్‌లో కెఎల్ రాహుల్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్, ఆరో స్థానంలో నిలిచింది.