రవీంద్ర జడేజాని విష్ చేయడానికి బయటికొచ్చిన స్పెషల్ గెస్ట్... బెంగాల్ టైగర్‌ వీడియోను...

Published : Mar 20, 2021, 04:29 PM IST
రవీంద్ర జడేజాని విష్ చేయడానికి బయటికొచ్చిన స్పెషల్ గెస్ట్... బెంగాల్ టైగర్‌ వీడియోను...

సారాంశం

సిడ్నీ టెస్టులో రవీంద్ర జడేజా ఎడమచేతి బొటనవేలికి గాయం... శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న రవీంద్ర జడేజా... ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ జడ్డూకి దక్కని చోటు... నేరుగా ఐపీఎల్ 2021 ద్వారానే రీఎంట్రీ...

మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కాన్ఫిడెన్స్ లెవల్స్ వేరే రేంజ్‌లో ఉంటాయి. ప్రపంచంలో ఏ విషయం జరిగినా, దాన్ని తనకు లింక్ చేసుకోగలిగే మనస్థత్వం అతనిది. అందుకే జడేజా అతని ఫ్యాన్స్ ముద్దుగా ‘సర్ జడ్డూ’ అని పిలుస్తుంటారు.

ఆస్ట్రేలియా టూర్‌లో రవీంద్ర జడేజా ఎడమచేతి బొటనవేలికి గాయం అయిన సంగతి తెలిసిందే. వేలికి సర్జరీ చేయడంతో రెండు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు రవీంద్ర జడేజా. ప్రస్తుతం అనుకోకుండా దొరికిన సెలవులను ఎంజాయ్ చేస్తున్న జడేజా, ఓ వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్లాడు.

అక్కడ అడవిలో నుంచి బయటికి వచ్చిన ఓ బెంగాల్ టైగర్ వీడియోను పోస్టు చేసిన జడేజా... ‘తను కేవలం నాకు త్వరగా కోలుకొమ్మని చెప్పడానికి బయటికి వచ్చింది’ అంటూ ఫన్నీగా కాప్షన్ ఇచ్చాడు. కొన్నాళ్ల క్రితం 2025లో బెస్ట్ క్రికెటర్ ఎవరని రాజస్థాన్ రాయల్స్ పోస్టు పెడితే, ‘రవీంద్ర జడేజా’ అంటూ తానే కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది