
19 ఏళ్ల తర్వాత సెంచూరియన్‌లో మొట్టమొదటి విజయాన్ని అందుకుంది టీమిండియా. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకి దక్కిన తొలి విజయమిది...
మంచి విజయంతో ఈ ఏడాదిని ముగించిన భారత జట్టు, సెంచూరియన్ టెస్టు విక్టరీని రిసార్ట్‌లో సెలబ్రేట్ చేసుకుంది. మొదటి టెస్టు విజయం గెలిచిన భారత జట్టును రిసార్ట్ సిబ్బంది డ్యాన్సులతో వెల్‌కమ్ చెప్పారు. భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, ఛతేశ్వర్ పూజారా కూడా రిసార్ట్ సిబ్బందితో కలిసి స్టెప్పులు వేశారు...
అశ్విన్, విరాట్, పంత్, సిరాజ్ డ్యాన్సులు వేయడం కొత్తేమీ కాదు కదా... ఎప్పుడూ సైలెంట్‌గా చాలా నెమ్మదస్తుడిగా ఉండే ఛతేశ్వర్ పూజారా... డ్యాన్సు చేయడం అందర్నీ కూసింత సర్‌ప్రైజ్ చేసింది. ఇదే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పూజారా డ్యాన్సులు చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
‘మ్యాచ్ ముగిసిన తర్వాత ఫోటోలకు ఫోజులివ్వడం చాలా బోరింగ్‌గా అనిపించింది. అయితే మహ్మద్ సిరాజ్‌తో, నాతో కలిసి ఛతేశ్వర్ పూజారా మొదటిసారి డ్యాన్స్ చేసి, ఈ మూమెంట్‌ని చాలా స్పెషల్ చేసేశాడు... వాట్ ఏ విన్...’ అంటూ రిసార్ట్ సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలను పోస్టు చేశాడు రవిచంద్రన్ అశ్విన్...
అలాగే భారత జట్టు బస చేస్తున్న హోటెల్‌లో మహ్మద్ షమీ, రిషబ్ పంత్ వ్యక్తిగత మైలురాళ్లను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసింది టీమిండియా... తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ, టెస్టు కెరీర్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మ్యాచ్ ద్వారా అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఇద్దరి వ్యక్తిగత మైలురాళ్లను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. 200 టెస్టు వికెట్లను తీసిన 11వ భారత బౌలర్‌గా, ఐదో ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ షమీ. మహేంద్ర సింగ్ ధోనీ 36 టెస్టుల్లో 100 వికెట్లను అందుకుంటే, రిషబ్ పంత్ 26 టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.
జనవరి 3, 2022 నుంచి జోహన్‌బర్గ్‌లోని ది వండేరర్స్ స్టేడియం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు కోసం నేడు జోహన్‌బర్గ్ బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు. ఆ తరవ్ాత జనవరి 11 నుంచి కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది.