రవిచంద్రన్ అశ్విన్‌కి గాయం... అయినా బ్యాటింగ్ కొనసాగిస్తున్న సీనియర్ స్పిన్నర్...

Published : Feb 09, 2021, 12:57 PM IST
రవిచంద్రన్ అశ్విన్‌కి గాయం... అయినా బ్యాటింగ్ కొనసాగిస్తున్న సీనియర్ స్పిన్నర్...

సారాంశం

అండర్సన్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి గాయం... నొప్పితో విలవిల్లాడిన భారత సీనియర్ స్పిన్నర్... అయినా బ్యాటింగ్ కొనసాగించిన అశ్విన్...

సిడ్నీ టెస్టులో పట్టువదలని పోరాటంతో మ్యాచ్‌ను డ్రా చేసిన భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మరోసారి తన మొండి పట్టుదలను ప్రదర్శించాడు. 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడింది టీమిండియా. భారత సారథి విరాట్ కోహ్లీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కలిసి డ్రా కోసం పోరాడుతున్నారు.

అయితే అండర్సన్, ఆర్చర్ బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి పలుమార్లు గాయమైంది. ఓ బౌన్సర్ నేరుగా దూసుకొచ్చి, అశ్విన్ కుడి చేతి వేలుకి గాయం చేసింది. నొప్పితో వేలుని మడచడానికి కూడా ఇబ్బంది పడిన అశ్విన్... ఫిజియో చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు.

విరాట్ కోహ్లీ టెస్లుల్లో 24వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, అశ్విన్ అతనికి తోడుగా క్రీజులో ఉన్నాడు. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి, ఇంగ్లాండ్‌ను స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే