INDvsENG: కుప్పకూలిన టాప్ ఆర్డర్, ఆరు వికెట్లు డౌన్.. ఓటమి అంచున ఇండియా

Published : Feb 09, 2021, 11:11 AM ISTUpdated : Feb 09, 2021, 11:12 AM IST
INDvsENG: కుప్పకూలిన టాప్ ఆర్డర్, ఆరు వికెట్లు డౌన్.. ఓటమి అంచున ఇండియా

సారాంశం

రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్... వాషింగ్టన్ సుందర్ డకౌట్... రిషబ్ పంత్ ఫెయిల్... భారత జట్టుపై 114 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్...

చెన్నై టెస్టులో భారత జట్టు 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న రిషబ్ పంత్‌, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచారు.

19 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రిషబ్ పంత్‌ను జేమ్స్ అండర్సన్ అవుట్ చేయగా, వాషింగ్టన్ సుందర్‌ను డామ్ బెస్ డకౌట్ చేశాడు. 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా, లక్ష్యానికి ఇంకా 303 పరుగుల దూరంలో ఉంది.

భారత జట్టుపై 114 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్, టీమిండియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 92 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 25 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోవడం విశేషం. 
 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !