
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్- ఫిబ్రవరి నెలకు గానూ భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి దక్కింది. ఫిబ్రవరిలో జరిగిన మూడు మ్యాచుల్లో 24 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
జనవరి నెల ప్రదర్శనకు గానూ రిషబ్ పంత్, ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు అందుకోగా రెండో అవార్డు కూడా టీమిండియా ఖాతాలోనే చేరింది.
ఫిబ్రవరి నెలలో 176 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, 24 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలవగా, అతనితో పోటీ పడిన జో రూట్, విండీస్ ప్లేయర్ కేల్ మేయర్‌కి నిరాశే ఎదురైంది. జో రూట్ జనవరి నెల నామినేషన్లలో కూడా ఉండడం విశేషం.