అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

By telugu teamFirst Published Oct 22, 2019, 9:36 AM IST
Highlights

టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 


రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.... తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. పరుగుల రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ... రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న చివరి టెస్టులో ఇన్నింగ్స్ పరుగుల విజయానికి భారత్ రెండు వికెట్ల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 497/9 వద్ద డిక్లేర్ చేసింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ కోహ్లీ మరోమాటకు తావులేకుండా దక్షిణాఫ్రికాకు ఫాలో ఆన్ ఇచ్చాడు.

Also Read ధోని ఆడగా లేనిది.. నా భర్త ఆడకూడదా: అభిమానులపై సర్ఫరాజ్‌ భార్య ఫైర్

 టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలడంతో.. భారత్‌కు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో సౌతాఫ్రికాని టీమ్‌ఇండియా ఫాలోఆన్ ఆడిస్తోంది.

Also Read కోహ్లీ క్యాన్ డిడ్ ఫోటో... గల్లీ బాయ్ చేసేసిన అభిమానులు

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విరాట్ 8సార్లు ఫాలోఆన్ ఆడించాడు. అజారుద్దీన్(7), మహేంద్ర సింగ్ ధోనీ(5), సౌరభ్ గంగూలీ(4) ఫాలోఆన్ ఆడించిన జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పుణె టెస్టులోనూ డుప్లెసిస్‌సేన ఫాలోఆన్ ఆడి ఓడిపోయింది.

click me!