ధోని ఆడగా లేనిది.. నా భర్త ఆడకూడదా: అభిమానులపై సర్ఫరాజ్‌ భార్య ఫైర్

By Siva KodatiFirst Published Oct 21, 2019, 6:05 PM IST
Highlights

తన భర్త ఎందుకు రిటైర్ అవ్వాలి.. ఆయన వయసు ఇంకా 32 ఏళ్లే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని వయసెంత...38 ఏళ్లైనా ధోని ఇంకా క్రికెట్ ఆడటం లేదా..? సర్పరాజ్ గొప్ప ఫైటర్.. ఆయన ఇంకా సుధీర్ఘకాలం క్రికెట్ ఆడి దేశానికి అనేక విజయాలను అందిస్తాడని ఖుష్బత్ ధీమా వ్యక్తం చేశారు. అటు సర్ఫరాజ్‌‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడంపై పాక్ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు

పాకిస్తాన్ టెస్ట్, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పించడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు తలో రకంగా స్పందిస్తున్నారు. అతని క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని.. త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

అయితే ఈ వార్తల నేపథ్యంలో సర్ఫరాజ్ భార్య ఖుష్బత్ సర్ఫరాజ్ స్పందించారు. తన భర్త ఎందుకు రిటైర్ అవ్వాలి.. ఆయన వయసు ఇంకా 32 ఏళ్లే.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని వయసెంత...38 ఏళ్లైనా ధోని ఇంకా క్రికెట్ ఆడటం లేదా..? సర్పరాజ్ గొప్ప ఫైటర్.. ఆయన ఇంకా సుధీర్ఘకాలం క్రికెట్ ఆడి దేశానికి అనేక విజయాలను అందిస్తాడని ఖుష్బత్ ధీమా వ్యక్తం చేశారు.

అటు సర్ఫరాజ్‌‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడంపై పాక్ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది శుభపరిణామం అని కొందరు పేర్కొనగా.. మరికొందరు తప్పుబట్టారు. టీ20లలో పాక్ జట్టును నంబర్ వన్‌గా తీర్దిదిద్దిన సర్ఫరాజ్‌పై వేటు వేయడం కరెక్ట్ కాదంటున్నారు.

Also Read:  సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు: శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ తోనే ముప్పు

మరోవైపు బాబర్ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే అతడి ఆటను దెబ్బతింటుందని మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.

అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని పీసీబీ భావించింది.. దీనికి తోడు కోచ్ మిక్కీ ఆర్ధర్ కూడా సర్ఫరాజ్‌కి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడు. అయితే అనూహ్యంగా కోచ్‌ని తప్పించిన పీసీబీ.. సర్ఫరాజ్‌ను నాయకత్వ బాధ్యతలలో కొనసాగించింది.

అయితే కొద్దిరోజుల క్రితం సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ని 0-3తో చేజార్జుకోవడంపై పీసీబీ మండిపడింది. సర్ఫరాజ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని చీఫ్ కోచ్, చీఫ్ సెలక్టర్‌గా ఉన్న మిస్బావుల్ హక్ సూచించాడు.

బ్యాట్స్‌మెన్‌తో పాటు కెప్టెన్సీలోనూ విఫలమైన అతను జట్టును సరైన దిశలో నడిపించలేకపోయాడని పలువురు మండిపడ్డారు. ఆస్ట్రేలియాతో త్వరలోనే పాక్ జట్టు సుధీర్ఘ సిరీస్ ఆడనుంది. 

Also Read: ధోనీని కాపీ కొట్టిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్

2016లో సర్ఫరాజ్ టీ20 కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 2017లో వన్డేల సారథ్యాన్ని కూడా అతనికి అప్పగించారు. ఆ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్ గా కూడా నియమించారు అయితే, పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జూనియర్ జట్టు చేతిలో సర్ఫరాజ్ జట్టు ఓటమి పాలైంది. దాంతోనే అతని కెప్టెన్సీకి ఎసరు వచ్చింది.

అత్యున్నత స్థాయిలో జట్టుకు నాయకత్వం వహించే గౌరవం దక్కిందని, కొత్త కెప్టెన్లు తమ బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. అజర్ అలీని, బాబర్ ఆజమ్ ను పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి అభినందించారు. 

 

click me!