రాంచి టెస్ట్: కొత్త తండ్రి రహానే కూడా సెంచరీ బాదేశాడు, రోహిత్ 150

By telugu teamFirst Published Oct 20, 2019, 10:20 AM IST
Highlights

రాంచి టెస్టులో అజింక్య రహానే అదరగొడుతున్నాడు. ఇప్పుడే శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

రాంచి: రాంచి టెస్టులో అజింక్య రహానే అదరగొడుతున్నాడు. ఇప్పుడే శతకం పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో 11వ టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2016 తరువాత స్వదేశంలో స్వదేశంలో నమోదు చేసిన తొలి సెంచరీ. రోహిత్ ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ సెంచరీ పూర్తి చేసే సమయానికి రహానే కూడా అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. నిన్ననే సెంచరీ బాదేస్తాడని అంతా అనుకున్న వరుణ దేవుడు మాత్రం నేటికీ పోస్ట్ పోనే చేసాడు. 

గత టెస్టు మ్యాచ్ జరుగుతుండగానే రహానే కు  కూతురు పుట్టింది. కూతురు పుట్టిన నెక్స్ట్ మ్యాచ్ కే సెంచరీ కొట్టడంతో  అతని మొఖంలో ఆనందం వెల్లివిరిసింది. మ్యాచ్ అయిపోయాక తన సెంచరీని కూతురికి అంకితమిస్తున్నానంటాడేమో చూడాలి. 

నిన్నటి ఓవర్ నైట్ స్కోర్ 224/3 వద్ద ఆట ఆరంభించిన భారత్, చాల కాన్ఫిడెంట్ గా కనపడుతుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలిద్దరు బాతును ఝుళిపిస్తున్నారు. గ్రౌండ్ లో నిన్నటిలానే పరుగుల వరద పారడం తథ్యంగా కనపడుతుంది. రహానే సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. 

నిన్న వెలుతురు సరిగా లేని కారణంగా తొలుత బ్రేక్ ఇచ్చినప్పటికీ, తరువాత వర్షం కారణంగా మ్యాచును ఆపేసారు. ఇప్పటికే రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరదపారిస్తున్నాడు. 4 సిక్సర్లు,13 ఫోరులు బాదాడు. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేసాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ. ఇప్పుడు 200 బంతుల్లో 150 పూర్తి చేసాడు. 

హిట్ మాన్ షో కంటిన్యూ అవుతుంది. ఇటుపక్క నుంచి రోహిత్ అటుపక్క నుంచి రహానే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. 

click me!