రాంచి టెస్ట్: ప్రారంభమైన ఆట...రెండో రోజు పొంచి ఉన్న వరుణుడు, ధోని రానట్టేనా?

By telugu teamFirst Published Oct 20, 2019, 9:55 AM IST
Highlights

రాంచి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. పిచ్ ప్రస్తుతానికి బాగుందని ఈ రోజంతా వర్షం పడకపోతే బ్యాట్స్ మన్ నిన్నటిలాగే పరుగుల వరద పారించొచ్చని పిచ్ రిపోర్టు తెలిపింది. మధ్యాహ్నం తరువాత 88శాతం వర్షం పడడానికి ఆస్కారం ఉందని గూగుల్ వెదర్ రిపోర్ట్ పేర్కొంటుంది.

రాంచి: రాంచి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. పిచ్ ప్రస్తుతానికి బాగుందని ఈ రోజంతా వర్షం పడకపోతే బ్యాట్స్ మన్ నిన్నటిలాగే పరుగుల వరద పారించొచ్చని పిచ్ రిపోర్టు తెలిపింది. మధ్యాహ్నం తరువాత 88శాతం వర్షం పడడానికి ఆస్కారం ఉందని గూగుల్ వెదర్ రిపోర్ట్ పేర్కొంటుంది. నిన్ననే వర్షం కారణంగా మ్యాచ్ అర్థాంతరంగా ముగియడంతో అభిమానులు చాల నిరాశ చెందారు. నేడు మాత్రం వరుణ దేవుడు కరుణించాలని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వేడుకుంటున్నారు. 

మ్యాచ్ ధోని సొంత నగరమైన రాంచీ లో జరుగుతుండడంతో అతను మ్యాచ్ వీక్షించేందుకు వస్తాడని వార్తలు గుప్పుమన్నాయి. కానీ గ్రౌండ్ స్టాఫ్ ని అడగగా, ఈ రోజుకైతే అలాంటిదేమి లేదని వారు తేల్చేసారు. చూడాలి రేపైనాధోని వస్తాడేమో!

నిన్నటి ఓవర్ నైట్ స్కోర్ 224/3 వద్ద ఆట ఆరంభించిన భారత్, చాల కాన్ఫిడెంట్ గా కనపడుతుంది. రోహిత్ శర్మ, అజింక్య రహానేలిద్దరు బాతును ఝుళిపిస్తున్నారు. గ్రౌండ్ లో నిన్నటిలానే పరుగుల వరద పారడం తథ్యంగా కనపడుతుంది. రహానే సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. 

నిన్న వెలుతురు సరిగా లేని కారణంగా తొలుత బ్రేక్ ఇచ్చినప్పటికీ, తరువాత వర్షం కారణంగా మ్యాచును ఆపేసారు. ఇప్పటికే రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరదపారిస్తున్నాడు. 4 సిక్సర్లు,13 ఫోరులు బాదాడు. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేసాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ. 

హిట్ మాన్ షో కంటిన్యూ అవుతుంది. ఇటుపక్క నుంచి రోహిత్ అటుపక్క నుంచి రహానే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. రోహిత్ 130 పరుగులు, రహానే 92 పరుగుల వద్ద కొనసాగుతున్నారు. 

భారత్‌ జట్టు 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కోహ్లీ 12 పరుగులవద్ద లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజరా(0)లు నిరాశపరిచారు. వీరిద్దరూ రబడా బౌలింగ్‌లో ఔటయ్యారు.  ప్రతిసారి క్రీజులో పాతుకుపోయి పుజారా ఇలా డక్ అవుట్ అవడంతో అభిమానులు ఉసూరుమన్నారు. 

click me!