రాంచి టెస్ట్: వెలుతురు సరిగాలేక ఆట నిలిపివేత.

By telugu teamFirst Published Oct 19, 2019, 3:08 PM IST
Highlights

రాంచి టెస్టులో వెలుతురు సరిగా లేని కారణంగా మంచును తాత్కాలికంగా ఆపేసారు. ఇంకో రెండుగంటల సమయం ఉండడంతో అంపైర్లు వేచి చూసే ధోరణిలో తాత్కాలిక బ్రేక్ మాత్రమే ఇచ్చారు

రాంచి టెస్టులో వెలుతురు సరిగా లేని కారణంగా మంచును తాత్కాలికంగా ఆపేసారు. ఇంకో రెండుగంటల సమయం ఉండడంతో అంపైర్లు వేచి చూసే ధోరణిలో తాత్కాలిక బ్రేక్ మాత్రమే ఇచ్చారు. 

రోహిత్ శర్మ, అజింక్య రహానే ఇద్దరు సఫారీ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. వారికేమి పాలుపోక బెంబేలెత్తుతున్నారు. ఇలా బ్రేక్ రావడంతో వారు ఊపిరి పీల్చుకొని స్టేడియం నుంచి వెళ్లి డ్రెస్సింగ్ రూంలో ఉపశమనం పొందుతున్నారు. మరోపక్క భారత అభిమానులు మాత్రం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. 

ఇప్పటికే రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరదపారిస్తున్నాడు. 4 సిక్సర్లు,13 ఫోరులు బాదాడు. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేసాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ. 

హిట్ మాన్ షో కంటిన్యూ అవుతుంది. ఇటుపక్క నుంచి రోహిత్ అటుపక్క నుంచి రహానే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. 

భారత్‌ జట్టు 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కోహ్లీ 12 పరుగులవద్ద లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజరా(0)లు నిరాశపరిచారు. వీరిద్దరూ రబడా బౌలింగ్‌లో ఔటయ్యారు.  ప్రతిసారి క్రీజులో పాతుకుపోయి పుజారా ఇలా డక్ అవుట్ అవడంతో అభిమానులు ఉసూరుమన్నారు. 

click me!