ముంబై కోచ్‌గా రమేశ్ పవార్... కోచ్ పదవికి రిజైన్ చేసిన వసీం జాఫర్...

Published : Feb 09, 2021, 03:57 PM IST
ముంబై కోచ్‌గా రమేశ్ పవార్... కోచ్ పదవికి రిజైన్ చేసిన వసీం జాఫర్...

సారాంశం

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు ఘోర ప్రదర్శన... విజయ్ హాజరే ట్రోఫీ 2021 ప్రారంభానికి ముందు కోచ్‌ని మార్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్... జార్ఖండ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన వసీం జాఫర్... 

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు ఘోర ప్రదర్శన కారణంగా కోచ్‌ను మార్చాలని నిర్ణయం తీసుకుంది ముంబై క్రికెట్ అసోసియేషన్. భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించిన భారత మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌ను ముంంబై జట్టుకి ప్రధాన కోచ్‌గా నియమించింది ఎంసీఏ.

ప్రస్తుతానికి ఈ సీజన్ మొత్తానికి రమేశ్ పవార్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు, ఆయన పనితీరును చూసి కొనసాగించేది? లేనిది నిర్ణయించుకుంటామని తెలిపారు. భారత జట్టు తరుపున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన 42 ఏళ్ల రమేశ్ పవార్, భారత మహిళా జట్టు కోచ్‌గా సేవలందించారు.

మరోవైపు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్, జార్ఖండ్ కోచ్ పదవికి రిజైన్ చేసినట్టు సమాచారం. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న జాఫర్, దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్‌కి ప్రధాన కోచ్‌గా వ్యవహరించేవారు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !