
India vs South Africa 3rd ODI: పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో వన్డేలో భారత బ్యాటర్స్ రాణించడంతో 50 ఓవర్లలో భారత్ 296/8 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి భారత ప్లేయర్ రజత్ పటిదార్ అరంగేట్రం చేశాడు. వేలి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరమవడంతో ఈ యంగ్ ప్లేయర్ కు మూడో వన్డేలో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చిన ఆ కుడిచేతి బ్యాట్స్ మన్ 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక సిక్సర్, మూడు ఫోర్లు ఉన్నాయి. సాయి సుదర్శన్ తో కలిసి ఈ మధ్యప్రదేశ్ బ్యాట్స్ మన్ 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో ఓవర్ తొలి బంతికి సిక్స్ బాదిన పాటిదార్ ఆ తర్వాత మూడో బంతికి మరో బౌండరీ కొట్టాడు. రజత్ పాటిదార్ క్రీజ్ లో కొద్ది సేపే ఉన్నప్పటికీ.. అతని బ్యాటింగ్ స్టైల్ ఆకట్టుకునేలా, వినోదాత్మకంగా సాగింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒక అద్బుతమైన షాట్ తో వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తు చేశాడు. తన క్లాస్ ఆటతో అభిమానులకు అలరించాడు.
రెండో ఓవర్ రెండో బంతికి పటీదార్ పాయింట్ అండ్ కవర్ ఫీల్డర్ల ద్వారా అద్భుతమైన బౌండరీ కోసం అందమైన బ్యాక్ఫుట్ పంచ్ ఆడి, లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్రేడ్ మార్క్ షాట్ ను అభిమానులకు గుర్తు చేశాడు.
Year Ender 2023: ఇయర్ ఆఫ్ ది కింగ్.. విరాట్ కోహ్లీ !