
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం, బయో బబుల్ జోన్‌లో గడపలేక రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ స్వదేశానికి పయనమయ్యాడు. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్‌కి ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా రాలేదు.
నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడం, ఏడాది కాలంగా బయో బబుల్ జోన్‌లో గడుపుతుండడంతో చిరాకు చెందిన లివింగ్‌స్టోన్, గత రాత్రి స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు.
ఇప్పటికే బెన్‌స్టోక్స్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో ఓ స్టార్ ప్లేయర్‌ను దూరం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, లివింగ్‌స్టోన్‌తో మరో స్టార్ దూరమైనట్టే. ఇప్పటికే నాలుగు మ్యాచులు ఆడినా ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్‌కి లివింగ్‌స్టోన్ దూరం కావడం పెద్ద దెబ్బే.
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్‌కే ప్లేయర్ జోష్ హజల్‌వుడ్, ఇదే కారణంగా ఇక్కడికి రావడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.