జో రూట్, చాహల్ అదిరిపోయే డ్యాన్స్... ఫ్యాన్స్ ఫిదా..!

Published : Apr 08, 2023, 09:56 AM IST
  జో రూట్, చాహల్ అదిరిపోయే డ్యాన్స్... ఫ్యాన్స్ ఫిదా..!

సారాంశం

వారి కిల్లింగ్ డ్యాన్స్ కి, వారి మధ్య ఉన్న రిలేషన్ కి నెటిజన్లు ఫిదా అయిపోతారు. డ్యాన్స్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

మొన్నటి వరకు మీ అభిమాన క్రికెటర్లు కేవలం గ్రౌండ్ లో మాత్రమే అలరించేవారు. కానీ... ఇప్పుడు కేవలం గ్రౌండ్ కే సరిపెట్టడం లేదు. సోషల్ మీడియాలోనూ అలరిస్తూనే ఉన్నారు. తాజాగా.. క్రికెటర్లు జోరూట్, యజ్వేంద్ర చాహల్ లు.. డ్యాన్స్ తో అదరగొట్టారు. వారి డ్యాన్స్ కి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోని రాజస్థాన్ రాయల్స్ తమ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

చిన్న క్లిప్‌లో, ఫరాసత్ అనీస్ రూపొందించిన వైరల్ ట్రాక్ బిబా యొక్క సూపర్ క్యాచీ బీట్‌లకు ఇద్దరు క్రికెటర్లు కాలు కదిపారు. సినీ నటులకు ఏమాత్రం తీసిపోకుండా వీరి డ్యాన్స్ ఉండటం విశేషం. వారి కిల్లింగ్ డ్యాన్స్ కి, వారి మధ్య ఉన్న రిలేషన్ కి నెటిజన్లు ఫిదా అయిపోతారు. డ్యాన్స్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి.. జోరూట్ కి స్పెషల్ గా ఐపీఎల్ కి స్వాగతం అంటూ క్యాప్షన్ జత చేశారు. 

 

ఈ వీడియో దాదాపు 8 లక్షల మంది వీక్షించడం విశేషం. ఇక కామెంట్స్ గురించి అయితే స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ వీడియోలో వారి డ్యాన్స్ కి ఎడిక్ట్ అయిపోయామని.. లూప్ లో చూస్తేనే ఉన్నామని ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. మరి కొందరు ఊ అంటావా మామ పాటకు డ్యాన్స్ వేస్తే బాగుండేదని కామెంట్ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

5 Wickets in 1 Over : W, W, W, W, W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ కొత్త చరిత్ర
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !