IPL 2023: సన్‌రైజర్స్‌కి వరుసగా రెండో ఓటమి... లక్నో ‘సూపర్’ విక్టరీ..

Published : Apr 07, 2023, 10:51 PM IST
IPL 2023: సన్‌రైజర్స్‌కి వరుసగా రెండో ఓటమి... లక్నో ‘సూపర్’ విక్టరీ..

సారాంశం

IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 16 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించిన లక్నో..  

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లోనూ ఫెయిలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్, సీజన్‌లో రెండో విజయాన్ని అందుకుంది.  

122 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో కైల్ మేయర్స్ వికెట్ త్వరగా కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్. 14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన కైల్ మేయర్స్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి వచ్చిన ఫజల్‌హక్ ఫరూకీ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన దీపక్ హుడా, భువీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు..

45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్. 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కీపర్ అన్‌మోల్‌ప్రీత్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

కెఎల్ రాహుల్ 31 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ కాగా రొమారియో షెఫర్డ్ డకౌట్ అయ్యాడు. అయితే నికోలస్ పూరన్ 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు, మార్కస్ స్టోయినిస్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు. 

లో స్కోరింగ్ గేమ్‌లో ఏకంగా 17 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు హైదరాబాద్ బౌలర్లు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. బౌలింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పైన టాస్ గెలిచి మరీ బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది.. 

7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి కెప్టెన్ అయిడిన్‌ మార్క్‌రమ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు కృనాల్ పాండ్యా.  

ఆ తర్వాత 4 బంతుల్లో 3 పరుగులు చేసిన హారీ బ్రూక్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో కుదురుకుపోయారు. ఈ ఇద్దరూ కలిసి 50 బంతులు ఆడి 39 పరుగుల భాగస్వామ్యమే జోడించారు.. 41 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, యష్ ఠాకూర్ బౌలింగ్‌లో అమిత్ మిశ్రా పట్టిన కళ్లు చెదిరే షాట్‌కి పెవిలియన్ చేరాడు. 

28 బంతులు ఆడినా ఒక్క బౌండరీ కొట్టలేకపోయిన వాషింగ్టన్ సుందర్, 16 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. వస్తూనే బౌండరీ బాదిన అదిల్ రషీద్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో దీపక్ హుడాకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

20వ ఓవర్ తొలి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించిన ఉమ్రాన్ మాలిక్ రనౌట్ అయ్యాడు. జయ్‌దేవ్ ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన అబ్దుల్ సమద్, 10 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి హైదరాబాద్ స్కోరు 120 మార్కు దాటించాడు... 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !