
వెస్టిండీస్ భారీ ఖాయుడు, స్పిన్ ఆల్‌రౌండర్ రహ్కీమ్ కార్న్‌వాల్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలో సెన్సేషనల్ సెంచరీతో చెలరేగాడు. రహ్కీమ్ కార్న్‌వాల్ సెంచరీ కారణంగా 221 పరుగుల కొండంత లక్ష్యం కూడా చిన్నదైపోయింది.. సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ పాట్రియట్స్ జట్టు... భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేక... వరుసగా ఆరో పరాజయాన్ని అందుకుంది.
బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ పాట్రియట్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆండ్రే ఫ్లెంచర్ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు, విల్ సమీద్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశారు. జేడ్ గూలీ 22 చేసి రిటైర్ హార్ట్ అయితే, కెప్టెన్ షెఫర్డ్ రూథర్‌ఫర్డ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు..
బౌలింగ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులిచ్చిన రహ్కీమ్ కార్న్‌వాల్, 2 వికెట్లు పడగొట్టాడు. కైల్ మేయర్స్‌తో ఓపెనింగ్ చేసిన రహ్కీమ్ కార్న్‌వాల్.. తొలి వికెట్‌కి 41 పరుగులు జోడించాడు. 13 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసిన కైల్ మేయర్స్, కాబిన్ బాస్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు లూరీ ఎవన్స్, డొమినిక్ డ్రాక్స్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 12 సిక్సర్లతో 102 పరుగులు చేసిన రహ్కీమ్ కార్న్‌వాల్... సెంచరీ తర్వాత రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు..
26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన బార్బడోస్ రాయల్స్ కెప్టెన్ రోవ్‌మెన్ పావెల్, అలిక్ అథనజే 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించేశాడు. రహ్కీమ్ కార్న్‌వాల్ సెన్సేషనల్ సెంచరీ కారణంగా 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది బార్బడోస్ రాయల్స్..
సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ పాట్రియట్స్ జట్టుకి ఇది 8 మ్యాచుల్లో ఆరో పరాజయం. మొదటి రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. బార్బడోస్ రాయల్స్‌కి ఇది 7 మ్యాచుల్లో మూడో విజయం. ఓ మ్యాచ్ వర్షంతో రద్దు కాగా మరో 3 మ్యాచుల్లో ఓడింది రాయల్స్ టీమ్..