22 సిక్సర్లు, 17 ఫోర్లు, 77 బంతుల్లో 205 పరుగులు... టీ20ల్లో డబుల్ సెంచరీ బాదిన కార్న్‌వాల్...

By Chinthakindhi RamuFirst Published Oct 7, 2022, 10:31 AM IST
Highlights

అట్లాంట ఓపెన్ 2022 లీగ్‌లో డబుల్ సెంచరీ బాదిన విండీస్ బ్యాటర్ రహ్కీం కార్న్‌వాల్... బౌండరీల ద్వారా 200 పరుగులు చేసిన కార్న్‌వాల్.. 

వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదడమే చాలా కష్టం!  వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్లను వేళ్ల మీద లెక్కెట్టోచ్చు..అలాగే 120 బంతులుండే టీ20ల్లో సెంచరీ చేస్తే ఆహా... అనుకుంటాం. అలాంటిది ఏకంగా డబుల్ సెంచరీ బాదేస్తే..! ఇలాంటి విధ్వంసమే క్రియేట్ చేశాడు విండీస్ బ్యాటర్ రహ్కీం కార్న్‌వాల్. అట్లాంట ఓపెన్ 2022 లీగ్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అట్లాంట ఫైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 326 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. 18 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 53 పరుగులు చేసిన స్టీవెన్ టేలర్ అవుట్ కాగా రహ్కీం కార్న్‌వాల్ 77 బంతుల్లో 17 ఫోర్లు, 22 సిక్సర్లతో 205 పరుగులు చేసి... టీ20ల్లో డబుల్ సెంచరీ బాదేశాడు...

రహ్కీం కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌లో కేవలం బౌండరీల ద్వారానే  200 పరుగులు వచ్చేశాయి. వీటిలో సిక్సర్ల ద్వారా 132 పరుగులు, ఫోర్ల ద్వారా 78 పరుగులు రావడం విశేషం. మొత్తంగా తన ఇన్నింగ్స్‌లో రహ్కీం కార్న్‌వాల్ ఐదు సింగిల్స్ మాత్రమే తీశాడు. అంటే మొత్తంగా కార్న్‌వాల్ 44 బంతుల్లో 205 పరుగులు రాబట్టగా మిగిలిన 33 బంతులను డాట్ బాల్స్ ఆడాడు. కార్న్‌వాల్ ఫైర్ క్రాకింగ్ ఇన్నింగ్స్ కారణంగా అట్లాంట ఫైర్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో మరో 15 పరుగులు వచ్చాయి...

ARE YOU NOT ENTERTAINED?!

Rahkeem Cornwall put Atlanta Fire on top with a DOUBLE century going 205*(77) with 2️⃣2️⃣ MASSIVE sixes 🤯🤯🤯 pic.twitter.com/1iRfyniiUw

— Minor League Cricket (@MiLCricket)

327 పరుగుల లక్ష్యఛేదనలో స్క్వైర్ డ్రైవ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో అట్లాంట ఫైర్ జట్టు 173 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రాధాకృష్ణ మర్రిపాటి 16 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా అభినవ్ శిఖరం 4 పరుగులు, అజితేశ్ భద్వౌర్యా 3, తేజాస్ కోమటిరెడ్డి 14 పరుగులు చేసి అవుట్ కాగా యశ్వంత్ బాలాజీ 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

జెరెమీ డి లిమా 10, వరుణ్ సాయి మంత 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు, భుషణ్ గుణగే 8, దేవమ్ శ్రీవాస్తవ 11 పరుగులు చేశారు. అట్లాంట ఫైర్ జట్టు బౌలర్ జస్టిన్ డిల్ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 

click me!