INDvsSA 1st ODI: క్లాసెన్ క్లాస్, మిల్లర్ మాస్... టీమిండియా ముందు...

By Chinthakindhi RamuFirst Published Oct 6, 2022, 7:06 PM IST
Highlights

40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసిన సౌతాఫ్రికా... హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్... 

హెన్రీచ్ క్లాసెస్ క్లాస్, డేవిడ్ మిల్లర్ మాస్ ఇన్నింగ్స్‌లతో చెలరేగి, సౌతాఫ్రికాకి భారీ స్కోరు అందించారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది సౌతాఫ్రికా. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించారు అంపైర్లు... 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలెట్టింది. తొలి ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ వికెట్ తీసినంత పని చేశారు. జానెమన్ మలాన్ వికెట్ గురించి డీఆర్‌ఎస్ తీసుకుంది టీమిండియా. అయితే రిప్లైలో అంపైర్స్ కాల్స్‌గా తేలడంతో సౌతాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన తర్వాత ఓపెనర్లు ఆచి తూచి ఆడుతూ సెటిల్ అవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి 49 పరుగులే చేయగలిగింది సౌతాఫ్రికా..

42 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన జాన్నెమన్ మలాన్‌ని అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. టీ20 సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన కెప్టెన్ తెంబ భవుమా, తొలి వన్డేలోనూ అదే పర్ఫామెన్స్ రిపీట్ చేశాడు...

12 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన భవుమా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 5 బంతుల్లో పరుగులేమి చేయలేకపోయిన అయిడిన్ మార్క్‌రమ్‌ని కుల్దీప్ యాదవ్ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

54 బంతుల్లో 5 ఫోర్లతో 48 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 110 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాని హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ కలిసి ఆదుకున్నారు...

భారత ఫీల్డర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో ఆ అవకాశాలు అద్భుతంగా వాడుకున్న హెన్రీచ్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్ ఐదో వికెట్‌కి 106 బంతుల్లో 139 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. డేవిడ్ మిల్లర్ 63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేయగా క్లాసెన్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు...

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 8 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. 

click me!