క్రికెట్ లోనూ జాతి వివక్ష.. నేను ఎదుర్కొన్నా.. క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్

By telugu news teamFirst Published Jun 2, 2020, 10:25 AM IST
Highlights

అమెరికాలో ఓ నల్లజాతీయుడిని ఓ పోలీస్‌ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.

ఫుట్ బాల్ లో మాత్రమే కాదు.. క్రికెట్ లోనూ జాతి వివక్ష ఉందంటూ వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన శరీర రంగు కారణంగా తాను కూడా ఎన్నో సార్లు వివక్ష ఎదుర్కొన్నానంటూ గేల్ పేర్కొన్నాడు. అమెరికాలో ఓ నల్లజాతీయుడిని ఓ పోలీస్‌ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నల్ల జాతీయులు కూడా అందరిలాంటి వారే. మమ్మల్ని ఫూల్స్‌లా భావించవద్దు. నేను కూడా వివిధ దేశాలు పర్యటించినప్పుడు వర్ణ వివక్ష ను ఎదుర్కొన్నా. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. రేసిజం అనేది ఫుట్‌బాల్‌లోనే కాదు క్రికెట్‌లోనూ ఉంది' అని గేల్‌ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో రాసుకొచ్చాడు.

నల్లజాతీయుడిని అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఫార్ములావన్‌ (ఎఫ్‌1) ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ గళం విప్పాడు. ఇంగ్లండ్‌ నల్లజాతి రేసర్‌ అయిన హామిల్టన్‌ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా' అని సోషల్‌ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ అన్నాడు.

click me!