భారత జట్టుకు కోహ్లీ కేవలం కెప్టెన్ మాత్రమే...అన్నీ ధోనీనే: కోచ్ కేశవ్ బెనర్జీ

By Arun Kumar PFirst Published May 11, 2019, 4:48 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికన ఈ నెల చివర్లో వరల్డ్ కప్ 2019  ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ప్రియుల దృష్టంతా ఆ మెగా టోర్నీపైనే వుంది. ముఖ్యంగా  గతేడాది పేలవ ఆటతీరుతో విమర్శలను ఎదుర్కొన్న ఎంఎస్ ధోని ఈ ఏడాది అద్భుతంగా  ఆడుతున్నాడు. మంచి ఫామ్ ను కొనసాగిస్తూ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విదేశీ సీరీసులతో పాటు ఐపిఎల్ లో కూడా రాణిస్తూ ధోనీ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇలా టీమిండియా బ్యాట్ మెన్ గా, సీఎస్కే కెప్టెన్ గా వరల్డ్ కప్ కు ముందు అదరగొడుతున్న తన శిష్యుడు ధోని గురించి  కోచ్ కేశవ్‌ బెనర్జీ మాట్లాడారు. 

చిన్నప్పుడు ధోనికి క్రికెట్ మెలకువలు నేర్పి మంచి పునాది పడేలా చేశారు కోచ్ కేశవ్ బెనర్జీ.  ప్రపంచ కప్ 2019 నేపథ్యంలో ఆయన తన శిష్యుడి గురించి స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా అధికారికంగా కోహ్లీ వున్నా...అనధికారికంగా ధోనినే కెప్టెన్ చేయాల్సిన పనులు చేస్తున్నాడని అన్నారు. మైదానంలోని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో ధోని ఆరితేరాడని...కోహ్లీ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని పేర్కొన్నారు. కాబట్టి యువ  జట్టుకు కోహ్లీ కంటే ఎక్కువగా ధోనినే సలహాలివ్వడం మనం మైదానంలో చూస్తుంటామని బెనర్జీ తెలిపారు. 

ప్రపంచ కప్ 2019 మెగా టోర్నీలో ధోని సలహాలు, సూచనలు భారత ఆటగాళ్ళకు ఎంతో ఉపయోగపడతాయని అన్నాడు. అతడి సారథ్యంలోనే రెండోసారి ప్రపంచ కప్  గెలిచిన  విషయాన్ని గుర్తుచేశారు. అప్పటి ధోని అనుభవం ప్రస్తుత ప్రపంచ కప్ లో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ధోని ఒకవేళ జట్టుకు  దూరమైతే కోహ్లీకి సలహాలిచ్చేవారు కరువవుతారని  బెనర్జీ పేర్కొన్నారు. 

ఇక ధోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ... నాలుగో స్థానానికే అతడు చక్కగా సరిపోతాడని అన్నారు. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్  దిగితే ఒత్తిడితో  ఆడాల్సి  వుంటుందన్నారు. అందువల్ల అతడు స్వేచ్చగా ఆడాలంటే కాస్త  ముందుగానే బ్యాటింగ్ కు దిగాల్సి వుంటుందన్నారు. 

ధోని ప్రస్తుతం చాలా పిట్‌గా వున్నాడని...ప్రపంచ కప్ తర్వాత కూడా అతడు తన కెరీర్ ను కొనసాగించే అవకాశం వుందన్నారు. అయితే  అతడి రిటైర్మెంట్ పై తనకు ఎలాంటి సమాచారం  లేదన్నాడు. నాకే కాదు ధోని తండ్రి, భార్యకు కూడా ఈ విషయం గురించి తెలిసివుండదని బెనర్జీ చమత్కరించారు.

click me!