రబాడాతో సూపర్ ఓవర్ వేయించడానికి కారణమదే: డిల్లీ కెప్టెన్ శ్రేయాస్

By Arun Kumar PFirst Published Mar 31, 2019, 1:59 PM IST
Highlights

ఐపిఎల్ సీజన్ 12 ప్రారంభమై వారంరోజుల తర్వాత అసలుసిసలైన ఐపీఎల్ మజా శనివారం రాత్రి అభిమానులకు లభించింది. ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకు ఉత్కంఠ. నువ్వా నేనా అన్నట్లు ఇరు జట్లు తలపడినా ఫలితం తేలక సూపర్ ఓవర్ ద్వారా తుదిఫలితం. ఆ సూపర్ ఓవర్ లో కూడా నరాలు తెగే ఉత్కంఠ. ఇలా ప్రతిక్షణం క్రికెట్ మజాను అందిస్తూ సాగింది డిల్లీ క్యాపిటల్స్ vs కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్. అయితే సూపర్ ఓవర్ సందర్భంగా జరిగిన ఆసక్తికర విషయాలను డిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బయటపెట్టారు. 

కోల్ కతా తన ముందు ఉంచిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ ఒక వికెట్ 10 పరుగులు చేసింది. అనంతరం కోల్ కతా తప్పకుండా సూపర్ ఓవర్లో రస్సెల్స్ ను బరిలోకి దించుతుందని తాను ముందే పసిగట్టానని డిల్లీ కెప్టెన్ అయ్యర్ పేర్కొన్నారు. అందువల్ల అతడిని సమర్ధవంతంగా అడ్డుకునే బౌలర్లు తమ జట్టులో ఎవరున్నారని చూడగా రబాడ కనిపించాడని తెలిపాడు.

దీంతో అతడి వద్దకు వెళ్లి కోల్ కతా జట్టును ఎలా అడ్డుకుంటావని ప్రశ్నించగా అతడి నోటి నుండి వచ్చిన ఒకే ఒక మాట యార్కర్. ప్రతి బాల్ యార్కర్ వేస్తానని రబాడ తనకు మాటిచ్చాడని అయ్యర్ వెల్లడించారు. అతడి మాట్లలో కాన్పిడెన్స్, ఇచ్చిన మాట నిలబెట్టెకుంటాడన్న నమ్మకంతో అతడి చేతికి బంతిని అప్పగించినట్లు పేర్కొన్నారు. 

తన నమ్మకం వమ్ము కాలేదని సూపర్ ఓవర్లో రబాడా విసిరిన రెండో బాల్ ప్రూవ్ చేసిందన్నారు. విద్వంసకర బ్యాట్  మెన్ రస్సెల్స్ ని అద్భుతమైన యార్కర్ తో రబాడా క్లీన్ బౌల్డ్ చేయడాన్ని అయ్యర్ గుర్తుచేశారు. ఆ తర్వాత కూడా ప్రతి బాల్‌ యార్కర్ సంధించి జట్టును విజయతీరాలకు చేర్చాడని పేర్కొన్నారు. 

సూపర్ ఓవరలో మొదట బ్యాటింగ్ కు చేపట్టిన డిల్లీ 10 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్ ప్రసీద్ ఈ సూపర్ ఓవర్ వేయగాపంత్ 6నాటౌట్, అయ్యర్ 4 పరుగులు చేశారు. ఆ తర్వాత డిల్లీ తరపున రబడ సూపర్‌ ఓవర్ వేయగా కోల్‌కతా 4,0, ఔట్‌ (రసెల్‌), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది. 
 
click me!