ఒక్క పరుగుతో పృథ్వీ షా సెంచరీ మిస్: కోల్ కతాపై ఢిల్లీ 'సూపర్' విక్టరీ

Published : Mar 31, 2019, 07:03 AM IST
ఒక్క పరుగుతో పృథ్వీ షా సెంచరీ మిస్: కోల్ కతాపై ఢిల్లీ 'సూపర్' విక్టరీ

సారాంశం

కోల్ కతా తన ముందు ఉంచిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. 

న్యూఢిల్లీ: ఐపిఎల్ 12వ ఎడిషన్ లో భాగంగా శనివారం కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచు ఉత్కంఠగా సాగింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. అయితే, ఈ విజయం ఢిల్లీకి సూపర్ ఓవరులో దక్కింది,

కోల్ కతా తన ముందు ఉంచిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ జట్టు పది పరుగులు చేయగా కోల్‌కతా జట్టు 7 పరుగులే చేయగలిగింది. దీంతో విజయం ఢిల్లీ వశమైంది.

ఢిల్లీ జట్టు స్టార్ ఆటగాడు పృథ్వీ షా ఒక్క పరుగుతో మిస్సయ్యాడు. పృధ్వీ షా 99, ధావన్ 16, అయ్యర్ 43, పంత్ 11, విహారీ 2 పరుగులు చేశారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. నిఖిల్ నాయక్(7), ఊతప్ప(11), క్రిస్ లిన్(20), నితిశ్ రానా(1), కార్తీక్ 50, గిల్(4), రస్సెల్ 62, చావ్లా 12, కుల్దీప్ యాదవ్ 10 పరుగులు చేశారు.

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే