క్వింటన్ డి కాక్ ఫ్యామిలీలోకి చిన్నారి కియారా... అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటూ...

Published : Jan 06, 2022, 08:19 PM IST
క్వింటన్ డి కాక్ ఫ్యామిలీలోకి చిన్నారి కియారా... అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటూ...

సారాంశం

Quinton de kock: కూతురికి కియారా అని నామకరణం చేసిన క్వింటన్ డి కాక్ ఫ్యామిలీ... కూతురితో ఎక్కువ సమయం గడిపేందుకు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డి కాక్...

సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ శుభవార్త తెలిపాడు. డి కాక్ భార్య శాశా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురికి కియారా అని నామకరణం కూడా చేసేసింది క్వింటన్ డి కాక్ ఫ్యామిలీ... కూతురుని గుండెలకు హత్తుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు డి కాక్...

‘ఎలా ఉన్నారు... నా పేరు కియారా డి కాక్...’ అంటూ కూతురి ఫోటోలకు కాప్షన్ ఇచ్చాడు క్వింటన్ డి కాక్. ఆయన సతీమణి శశా... ‘కియారా డి కాక్... 06.01.202... 2.9కేజీలు... మా ప్రపంచంలో మా బ్యూటీఫుల్ డాటర్‌కి సుస్వాగతం...’ అంటూ పోస్టు చేసింది... 

టీమిండియాతో జరిగిన సెంచూరియన్ టెస్టులో పాల్గొన్న క్వింటన్ డి కాక్, ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ధాంతరంగా టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశాడు.  

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అర్ధాంతరంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు డి కాక్... వాస్తవానికి టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు 29 ఏళ్ల క్వింటన్ డి కాక్, తన భార్య ప్రసవం కోసం టీమిండియాతో జరిగే రెండు, మూడో టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు.

 పెటర్నిటీ లీవ్ ద్వారా డి కాకక్ దూరంగా ఉంటాడని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ముందుగానే ప్రకటించింది. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు డి కాక్...

54 టెస్టుల్లో 38.38 సగటుతో 6 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో 3,300 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, వికెట్ కీపర్‌గా 221 క్యాచులు, 11 స్టంపౌట్లు చేశాడు... టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకున్నా, వన్డే, టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతానని, జట్టుకి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు క్వింటన్ డి కాక్...

టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కి ప్రకటించిన సౌతాఫ్రికా జట్టులో క్వింటన్ డి కాక్‌కి చోటు దక్కింది. 2021 ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఉన్న క్వింటన్ డి కాక్, ఏడాది చివరికి వచ్చే సరికి టెస్టుల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడం విశేషం...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ మూమెంట్ కోసం క్రికెటర్లందరూ మ్యాచ్ ఆరంభానికి ముందు మోకాళ్ల మీద నిల్చుని, చేతుల పైకెత్తేతూ తమ మద్ధతు తెలపాలని సూచించింది ఐసీసీ.  అయితే సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింగన్ డి కాక్ మాత్రం ఈ మూమెంట్‌కి సపోర్ట్ చేయడం ఇష్టం లేక, సౌతాప్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మోకాళ్ల మీద కూర్చోలేదు.

ఈ కారణంగానే ఓ మ్యాచ్‌కి కూడా దూరమైన క్వింటన్ డి కాక్, ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పి, జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు