‘పుష్ఫ’ క్రేజ్ తగలెయ్యా... నేపాల్ దాకా పోయిందిగా! నేపాల్ వుమెన్ క్రికెటర్ సెలబ్రేషన్స్...

Published : May 10, 2022, 06:56 PM ISTUpdated : May 10, 2022, 07:09 PM IST
‘పుష్ఫ’ క్రేజ్ తగలెయ్యా... నేపాల్ దాకా పోయిందిగా! నేపాల్ వుమెన్ క్రికెటర్ సెలబ్రేషన్స్...

సారాంశం

 ఫేయిర్‌బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ‘పుష్ఫ తగ్గేదేలే’ స్టైల్‌ని కాపీ చేసిన నేపాల్ బౌలర్ సీతా రాణా... వీడియో పోస్టు చేసిన ఐసీసీ...

క్రికెట్‌లో ఒక్కో ప్లేయర్‌కి ఒక్కో రకమైన విభిన్నమైన సెలబ్రేటింగ్ స్టైల్స్ ఉంటాయి. శిఖర్ ధావన్ క్యాచ్ పట్టినా, సెంచరీ చేసినా తొడ కొడుతూ, మీసం తిప్పుతూ సెలబ్రేట్ చేసుకుంటాడు. టీ20 స్టార్ బౌలర్ తబ్రేజ్ షంసీ, తన బూటు తీసి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా వింతైన సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. షెల్డ్రెన్ కాట్రెల్, వికెట్ తీసిన తర్వాత మిలిటరీ స్టైల్‌లో సెల్యూట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాడు...

అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లేయర్ వికెట్ తీసినా, సెంచరీ చేసినా, గాల్లోకి ఎగురుతూ క్యాచ్ పట్టినా... ‘పుష్ఫ’ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకుంటూ ‘తగ్గేదేలే’ అని సిగ్నల్ ఇస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ నుంచి మొదలైన ఈ ‘తగ్గేదేలే’ సెలబ్రేషన్స్, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను తాకి... బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఓ ఊపు ఊపింది...

బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో బౌలర్లు వికెట్ తీసిన ప్రతీసారీ ‘పుష్ఫ’ సెలబ్రేషన్స్‌ని కాపీ చేస్తూ... ‘తగ్గేదేలే’ అంటూ ఫీల్డ్‌లో క్రేజీ స్టెప్పులతో రెచ్చిపోయారు కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి నేపాల్‌కి పాకింది ‘పుష్ఫ తగ్గేదేలే..’ క్రేజ్. 

దుబాయ్‌లో ప్రస్తుతం ఫేయిర్‌బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ జరుగుతోంది. టోర్నడో వుమెన్, సఫెరీ వుమెన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ప్లేయర్ సీతా రాణా మగర్, వికెట్ తీసిన తర్వాత తన దవడ కింద చేతిని పెట్టి, పుష్ఫ స్టైల్‌లో తగ్గేదేలే... అంటూ సెలబ్రేట్ చేసుకుంది...

ఈ సెలబ్రేషన్స్ కారణంగా ఫేయిర్‌బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నీకి, నేపాల్ బౌలర్ సీతా రాణా మగర్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐసీసీ. ‘సోషల్ మీడియాలో ఇది చాలా దూరం వెళ్లిపోయింది. నేపాల్ బౌలర్ సీతా రాణా మగర్ మోస్ట్ పాపులర్ సెలబ్రేషన్స్‌ చూడండి...’ అంటూ కాప్షన్ ఇచ్చింది ఐసీసీ...

తన సెలబ్రేషన్స్‌కి అర్థం వివరిస్తూ మరో వీడియో చేసింది సీతా రాణా మగర్. ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గేదేలే... అని యాటిట్యూడ్‌కి సింబలిక్ అయిన ఈ స్టైల్‌ తనకెంతో నచ్చిందని, అందుకే తాను కూడా ఎప్పుడూ ఏ విషయంలోనూ తగ్గేదేలే... అని చెప్పడానికి అలా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు వివరించింది సీతా రాణా మగర్...

‘పుష్ఫ’ సినిమా కంటే ‘తగ్గేదేలే’ సెలబ్రేషన్స్ స్టైల్‌కి ఎక్కువగా క్రేజ్ రావడం విశేషం. దీనికి కారణం ప్రతీ ఒక్కరూ ఆ యాటిట్యూడ్‌ని తమ పరిస్థితులకు అనుగుణంగా సొంతం చేసుకోవడమే... అంటున్నారు క్రికెట్, సినీ పండితులు. ఐపీఎల్ 2022 సీజన్‌లో డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఓబేయ్ కూడా ‘పుష్ఫ’ తగ్గేదేలే స్టైల్ సెలబ్రేషన్స్‌ని చేసుకున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ఫ’ సినిమా, రిలీజ్ రోజున నెగిటివ్ తెచ్చుకున్నా, ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది... వచ్చే ఏడాది రాబోయే ‘పుష్ఫ’ సీక్వెల్, ‘పుష్ఫ 2’కి బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !