20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 275 పరుగుల భారీ స్కోరు చేసిన పంజాబ్.. అభిషేక్ శర్మ సెంచరీ! 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 87 పరుగులు చేసిన అన్‌మోల్ ప్రీత్ సింగ్...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పంజాబ్ జట్టు సంచలనం క్రియేట్ చేసింది. ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, ఏకంగా 275 పరుగుల భారీ స్కోరు చేసి, భారత్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. టీ20 చరిత్రలో భారత్‌లో ఇదే అత్యధిక స్కోరు..
పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 51 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రభుసిమ్రాన్ సింగ్ 24, నమన్ ధీర్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అన్‌మోల్ ప్రీత్ సింగ్ 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 87 పరుగులు చేసి అదరగొట్టాడు..
కెప్టెన్ మన్‌దీప్ డకౌట్ అయినా ఆఖరి ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన సన్వీర్ సింగ్ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. పంజాబ్ బ్యాటర్ల దెబ్బకు ఆంధ్రా బౌలర్లు అందరూ కూడా 10+ ఎకానమీతో పరుగులు సమర్పించేశారు. స్టీఫెన్, పృథ్వీరాజ్, త్రిపురన విజయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
276 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 10 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది ఆంధ్రా జట్టు.. కెప్టెన్ శ్రీకర్ భరత్ 4 బంతులాడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. హనుమ విహారి 8, షేక్ రషీద్ 1, ఎరా సందీప్ 1 పరుగు చేయగా అశ్విన్ హెబ్బర్ 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ 3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 4 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.