రాహుల్ ఐపిఎల్ కెరీర్లో ఏప్రిల్ 8 ప్రాధాన్యత...అప్పుడు ఫాస్టెస్ట్...ఇప్పుడు రేర్ ఇన్నింగ్స్

By Arun Kumar PFirst Published Apr 9, 2019, 3:08 PM IST
Highlights

కింగ్స్ లెవెన్ పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శనతో సోమవారం చెలరేగి ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఓ అరుదైన విషయం భయటపడింది. రాహుల్ కి  ఏప్రిల్ 8వ తేదీ బాగా కలిసొచ్చేట్లు కనిపిస్తోంది. గతేడాది కూడా సరిగ్గా ఇదే రోజు అంటే ఏప్రిల్ 08న రాహుల్ ఐపిఎల్ క్రికెట్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడి పంజాబ్ కు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ లో అతడు కేవలం 14 బంతుల్లోని అర్థశతకాన్ని పూర్తి చేసుకుని యూసఫ్ పఠాన్ పేరిట వున్న ఆ రికార్డును బద్దలుగొట్టాడు. 

మళ్లీ సరిగ్గా అదేరోజున(ఏప్రిల్ 8వ తేదీ), అదే పంజాబ్ జట్టు తరపున ఆడిన రాహుల్ మరోసారి అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ని 150 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్ 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. ఈ తరుణంలో సహచర ఓపెనర్ గేల్ ఆదిలోనే వికెట్ కోల్పోయినా కేఎల్ రాహుల్ మాత్రం ఏమాత్రం తడబడకుండా కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాన్ని అందించాడు. అతడు కేవలం 53 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులతో హయ్యెస్ట్ స్కోర్ సాధించి నిలిచాడు.

ఇలా ఒకే తేధీన రాహుల్ ఇలా హాఫ్ సెంచరీలతో చెలరేగంతో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడం కాకతాళీయంగా జరిగినా ఇది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాహుల్ తనదైన రోజున ఒంటిచేత్తో విజయాన్ని అందించగల సత్తా వున్న ఆటగాడని నిరూపించడానికి గతేడాది ఇన్నింగ్స్ తో పాటు నిన్న ఆడిన సమయోచిన ఇన్నింగ్స్ ఉదాహరణ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాబట్టి అతన్ని తక్కువగా అంచనా వేయకూడదని ప్రత్యర్థులకు సూచించారు.    

click me!