పూజారా అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా... 100 పరుగుల దూరంలో...

Published : Jan 19, 2021, 11:51 AM IST
పూజారా అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా... 100 పరుగుల దూరంలో...

సారాంశం

211 బంతుల్లో 56 పరుగులు చేసిన పూజారా... ఆస్ట్రేలియాలో అత్యధిక సార్లు 200లకు పైగా బంతులు ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌గా రికార్డు... 228 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

నాలుగో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 211 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 228 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. ఇంకా విజయానికి 100 పరుగులు కావాలి...

పూజారాను అవుట్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఆస్ట్రేలియా, ఎట్టకేలకు ఫలితం రాబట్టింది. అంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే పూజారా రివ్యూ తీసుకున్నాడు. అయితే రిప్లైలో వికెట్ పై అంచున బంతి తగులుతున్నట్టు కనిపించడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.

ఆరో స్థానంలో మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్‌కి వచ్చాడు. రెండు వారాల ముందు వర్షపు చినుకులు పడినా, ఆటను కొనసాగిస్తున్నారు అంపైర్లు. గత 40 ఏళ్లల్లో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అత్యధిక సార్లు 200లకు పైగా బంతులు ఎదుర్కొన్న ప్లేయర్‌గా నిలిచాడు పూజారా. పూజారా ఈ ఫీట్ 6 సార్లు సాధించగా కోహ్లీ, కుక్ ఐదేసి సార్లు సాధించారు.

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !