మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు... PSL కోసం స్టేడియంలో బిగించిన సీసీటీవీ కెమెరాలను ఎత్తుకెళ్లిన దొంగలు..

Published : Feb 26, 2023, 01:14 PM IST
మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు... PSL కోసం స్టేడియంలో బిగించిన సీసీటీవీ కెమెరాలను ఎత్తుకెళ్లిన దొంగలు..

సారాంశం

లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బిగించిన 8 సీసీటీవీ కెమెరాలు మిస్సింగ్... నేటి నుంచి లాహోర్, రావల్పిండిలకు మారనున్న పాక్ సూపర్ లీగ్ మ్యాచులు.. 

ఇండియాలో క్రికెట్‌కి క్రేజ్ చాలా ఎక్కువ. అయితే పొరుగుదేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘాన్‌లతో పోలిస్తే మనకి ఉండే క్రికెట్ పిచ్చి కాస్త తక్కువే. టికెట్ల కోసం కొట్టుకోవడం, టికెల్ లేకుండా స్టేడియంలోకి రావడానికి గోడలు దూకడాలు చేయడంలో ఈ దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ముందువరుసలో ఉంటారు...

2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఆఫ్ఘాన్, పాక్ క్రికెట్ ఫ్యాన్స్, దుబాయ్ క్రికెట్ స్టేడియంలో చొరబడేందుకు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతేనా మనలాగే స్టేడియంలో రచ్చ రచ్చ చేయడంలోనూ పాక్ ఫ్యాన్స్ టాప్‌లో ఉంటారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహకులకు ఇలాంటి షాకే ఎదురైంది...

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ కోసం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు. స్టేడియంలో, స్టేడియం బయట జరిగే కదలికలను అనునిత్యం పర్యవేక్షించేందుకు వీటిని ఏర్పాటు చేశారు నిర్వాహాకులు. 

పీఎస్‌ఎల్ 2023 షెడ్యూల్‌లో భాగంగా ముల్తాన్, కరాచీ నగరాల్లో మ్యాచులు ఆడిన ఫ్రాంఛైజీలు, ఇకపై లాహోర్, రావాల్పిండి నగరాల్లో మ్యాచులు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 26న గడాఫీ స్టేడియంలో  లాహోర్ ఖలందర్స్, పెశావర్ జల్మీ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. 

ఈ మ్యాచ్‌కి ముందు స్టేడియంలో ఏర్పాట్లను పరీక్షించిన అధికారులకు షాక్ తగిలింది. స్టేడియంలో బిగించిన 8 సీసీటీవీ కెమెరాలను ఎవరో ఎత్తుకుపోయారని తెలిసి షాక్ అయ్యారు పీఎస్‌ఎల్ నిర్వాహాకులు. అలాగే ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరీక్షించేందుకు స్టేడియంలో పెట్టిన మానిటర్‌ని కూడా ఎవరో దొంగిలించినట్టు సమాచారం.. 

స్టేడియంలోకి బయటి వ్యక్తులకు అనుమతి ఉండదు. క్రికెటర్లకు మాత్రం ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తారు. దీంతో సీసీటీవీ కెమెరాలను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎప్పుడు ఎత్తుకెళ్లారు? అనే విషయం పాకిస్తాన్ సూపర్ లీగ్ అధికారులకు అంతుచిక్కని సవాల్‌గా మారింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న మొదలైన పాకిస్తాన్ సూపర్ లీగ్, మార్చి 19న ముగియనుంది. 2022సీజన్‌లో లాహోర్ ఖలందర్స్ తొలిసారి పాక్ సూపర్ లీగ్ టైటిల్ గెలవగా, 2 సార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది...

పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఖరీదైన క్రికెట్ లీగ్‌గా నిలిచింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధానని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. పాక్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా బాబర్ ఆజమ్ అందుకునే మొత్తం రూ.2 కోట్ల 30 లక్షలు... అదే భారత కరెన్సీలో వచ్చేసరికి రూ. కోటి 40 లక్షలు మాత్రమే. 

భారత కరెన్సీలో రూ.3 కోట్ల 40 లక్షలు అంటే పాక్ రూపాయల్లో దాని విలువ 10 కోట్ల 72 లక్షల పాక్ రూపాయలు. అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా స్మృతి మంధాన తీసుకునే మొత్తంగా సగం కూడా బాబర్ ఆజమ్‌కి దక్కడం లేదు. ఇకపై పీఎస్‌ఎల్‌ని ఐపీఎల్‌తో పోల్చకండి అంటూ పాక్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు ఇండియన్ క్రికెట్ లీగ్ ఫ్యాన్స్.. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు