మోడల్ తో పృథ్వీ షా డేటింగ్..? ఎవరీ మిస్టరీ గర్ల్..?

By telugu news teamFirst Published Oct 1, 2022, 9:53 AM IST
Highlights

ఆ మిస్టరీ గర్లే.. నిధి తపాడియా. దీంతో... ఆమె తో పృథ్వీ షా డేటింగ్ మొదలుపెట్టాడంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భారత క్రికెటర్ పృథ్వీ షా  ఓ యువతితో డేటింగ్ మొదలుపెట్టాడా..? అంటే.. అవుననే సమాధానమే వినపడుతోంది. గతంలో పృథ్వీ షా వేరే వారితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా... నిధి తపాడియా అనే యువతితో ప్రేమాయణం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత దసరా నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దసరా నవరాత్రులలో గర్భా డ్యాన్స్ చేయడం చాలా సహజం. కాగా... ఈ గర్భా డ్యాన్సులు తాను ఓ మిస్టరీ గర్ల్ నుంచి నేర్చుకుంటున్నట్లు పృథ్వీ షా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టాడు. ఆ మిస్టరీ గర్లే.. నిధి తపాడియా. దీంతో... ఆమె తో పృథ్వీ షా డేటింగ్ మొదలుపెట్టాడంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


నిధి తపాడియా ప్రస్తుతం భారత క్రికెటర్ పృథ్వీ షాకు నవరాత్రుల సందర్భంగా గర్బా స్టెప్స్ నేర్పిస్తోంది. ఈ ఫోటోలను పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమయాణం నడుస్తోందంటూ పుకార్లు రావడం మొదలయ్యాయి. నిధి తపాడియా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్, యాక్టర్.

నిధి తపాడియా  ఇంటర్నెట్ , ఇన్‌స్టాగ్రామ్ సంచలనం, సోషల్ మీడియా లో 104k మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె అందానికి కుర్రకారు అంతా ఫిదా అయిపోతూ ఉంటారు.

 

నిధి తపాడియా అనేక ప్రకటన ప్రచార ప్రచారాలలో కూడా కనిపించింది, ఆమె ఇప్పటివరకు మోడల్ చేసిన కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఎల్లే ఇండియా, మాన్యవర్ మోహే.

 నిధి తపాడియా  ప్రముఖ టీవీ షో CIDలో కూడా కనిపించింది, ఇది భారతీయ టెలివిజన్‌లో చాలా ఎక్కువకాలం వచ్చిన షో కావడం గమనార్హం.

click me!