నీ కూతురు జాగ్రత్త.. కిడ్నాప్ చేస్తా: ధోనీకి ప్రీతి జింటా వార్నింగ్

Siva Kodati |  
Published : May 09, 2019, 08:42 PM IST
నీ కూతురు జాగ్రత్త.. కిడ్నాప్ చేస్తా: ధోనీకి ప్రీతి జింటా వార్నింగ్

సారాంశం

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా... చెన్నై కెప్టెన్ ధోనీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా... చెన్నై కెప్టెన్ ధోనీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే గత ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన పంజాబ్... 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వరుస ఓటముల తర్వాత ఆఖరి మ్యాచ్‌‌లో విజయం సాధించడంతో ప్రీతి ఆనందం వ్యక్తం చేస్తూ.. మైదానంలో సందడి చేశారు. అనంతరం ధోనీతో కరచాలనం చేశారు. ఆ తర్వాత ట్వీట్టర్‌లో ‘‘ కెప్టెన్ కూల్‌కి చాలామంది అభిమానులున్నారు..

వారిలో తానొకరిని.. అయితే ఈ మధ్యకాలంలో తాను ధోనీతో పాటు ఆయన గారాలపట్టి జీవాకు కూడా ఫ్యాన్‌ని అయ్యానన్నారు. తన దృష్టి ఆమెపై పడిందని.. జీవా విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను.. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను అంటూ ప్రీతి జింటా ట్విట్టర్‌లో సరదాగా వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే