ఐపిఎల్ నుండి సన్ రైజర్స్ ఎలిమినేట్... ఉత్కంఠ పోరులో హైదారాబాద్ పై డిల్లీ విజయం

By telugu teamFirst Published May 8, 2019, 7:12 PM IST
Highlights

ఐపిఎల్ ఎలిమినేటర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాదుపై ఫిల్డీంగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

ఐపిఎల్ సీజన్ 12లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కు విశాఖ స్టేడియం వేదికయ్యింది. ఇలా మరో తెలుగు గడ్డపై జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ లో భాగంగా ఫైనల్ కు చేరుకునే ఒకే ఒక్క అవకాశాన్ని సన్ రైజర్స్ చేజార్చుకుంది. డిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమిపాలైన సన్ రైజర్స్ ఐపిఎల్ 12 నుండి నిష్క్రమించింది. 

హైదరాబాద్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి డిల్లీ చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే ఓపెనర్ పృథ్విషా హాఫ్ సెంచరీ(56 పరుగులు), రిషబ్ పంత్ (49 పరుగులు 21 బంతుల్లో)  మెరుపులు తోడవ్వడంతో డిల్లీ విజయాన్ని అందుకోగలిగింది. అయితేే 162 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోడానికి సన్ రైజర్స్ బౌలర్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించి విపలమయ్యారు. రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్,  ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. 

 ఐపిఎల్ ఎలిమినేటర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చివరలో వరుసగా ముగ్గురు అవుటయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో పాల్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్ శర్మకు 2 వికెట్లు దక్కగా, అమిత్ మిశ్రా, బౌల్ట్ చెరో వికెట్ తీశారు.

హైదరాబాద్ 147 పరుగుల వద్ద ఐదో వికెట్ ను జారవిడుచుకుంది. విజయ శంకర్ 11 బంతుల్లో 25 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగులో వెనుదిరిగాడు. 160 పరుగుల వద్ద హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది నబీ 13 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు.

హైదరాబాదు 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. హైదరాబాద్ 90 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మనీష్ పాండే పాల్ బౌలింగులో వెనుదిరిగాడు.

హైదరాబాద్ 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడే క్రమంలో గుప్తిల్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమిత్ మిశ్రా బౌలింగులో అవుటయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సాహా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

ఐపిఎల్ ఎలిమినేటర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాదుపై ఫిల్డీంగ్ ఎంచుకున్నాడు.హైదరాబాద్ తుది జట్టులోకి యూసుఫ్ పఠాన్ స్థానంలో దీపక్ హుడా వచ్చాడు. ఢిల్లీ తుది జట్టులోకి కొలిన్ ఇంగ్రామ్ స్థానంలో కొలిన్ మన్రో వచ్చాడు. 

click me!