ఫిట్ ఇండియా:విరాట్ కోహ్లీ, మోడీ మధ్య ఆసక్తికర సంభాషణ

By narsimha lodeFirst Published Sep 24, 2020, 4:34 PM IST
Highlights

ఫిట్‌నెస్ విషయమై ప్రముఖులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా  ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రధాని మోడీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

న్యూఢిల్లీ: ఫిట్‌నెస్ విషయమై ప్రముఖులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా  ఇండియన్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రధాని మోడీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

గురువారం నాడు  ఫిట్ ఇండియా మూమెంట్ కార్యక్రమంలో భాగంగా  ఫిట్‌నెస్ కు ప్రాధాన్యమిచ్చే ప్రముఖులతో మోడీ ఇవాళ సంభాషించారు.భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న మీకు కూడ యోయో పరీక్ష నిర్వహిస్తారా అని మోడీ ప్రశ్నించారు. దీనికి విరాట్ కోహ్లీ సమాధానమిచ్చారు.

యోయో పరీక్ష చాలా ముఖ్యమైందన్నారు. ఫిట్ నెస్ దృష్టితో చూస్తే చాలా ముఖ్యమైందన్నారు. ప్రపంచస్థాయి పరంగా చూస్తే మన జట్టు స్థాయి ఈ విషయంలో ఇంకా కొంచెం తక్కువేనన్నారు. 

also read:యోయో టెస్ట్: భారత క్రికెట్ తరపున ఆడాలంటే తప్పనిసరి

దాన్ని అన్ని విధాల పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.  ఇది ప్రాథమిక అవసరమన్నారు.టీ 20, టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందన్నారు. టెస్టు మ్యాచ్ లో ఆడితే రోజు మొత్తం ఆడాలి, మళ్లీ రెండో రోజుకు కూడ సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు.

ఈ మ్యాచ్ ల్లో ఆడాలంటే ఫిట్‌నెస్ అవసరమన్నారు. ఫిట్ నెస్ బెంచ్ మార్క్ అని ఆయన అభిప్రాయపడ్డారు. తాను చొరవ తీసుకొని యోయో పరీక్షకు హాజరౌతానని ఆయన చెప్పారు. 

ఈ పరీక్షలో విఫలమైతే తాను కూడ ఆటలో ఉండనని కోహ్లీ స్పష్టం చేశారు. మోడల్ మిలింద్ సోమన్ తో మోడీ సంభాషించారు. మీ వయస్సు గురించి మీరు చెప్పారు.. ఇది నిజమేనా... ఇంకేమైనా ఉందా... అని మోడీ ఆయనను అడిగారు.

ఇదే విషయమై చాలా మంది తనను ప్రశ్నిస్తారని మిలింద్ సోమన్ చెప్పారు.  మీ వయస్సు నిజంగా 55 ఏళ్లేనా ఇంత వయస్సులో కూడ 500 కి.మీ ఎలా పరుగెత్తగలరని ఆయన ప్రశ్నించారు.

మా అమ్మ వయస్సు 81 ఏళ్లు. ఇప్పటికీ మా అమ్మ పుషప్ప్ చేస్తోందని ఆయన చెప్పారు. మా అమ్మే నాకు స్పూర్తి అని ఆయన చెప్పారు. ఆమె లాగా తన జీవితం కూడ ఉండాలనుకొంటానని ఆయన చెప్పారు.మన పూర్వీకులు ప్రతి రోజూ 50 కి.మీ నడిచేవారని ఆయన గుర్తు చేశారు. పల్లెల్లో మహిళలు నీళ్లు తెచ్చుకొనేందుకు  కష్టపడతారన్నారు. 

ఆరోగ్య కరమైన ఆహారం, జీవన విధానంలో భాగమైనందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. ఫిట్ గా మారడం కష్టమనుకొన్నా.. కొద్దిగా క్రమశిక్షణతో సాధన చేస్తే తేలికే అని మోడీ చెప్పారు.  ఫిట్ గా ఉంటూ ఇతరులకు స్పూర్తిగా నిలవాలంటూ ఫిట్ నెస్ కా డోస్ అధాగంటా రోజ్ అని మోడీ పేర్కొన్నారు.

click me!