కోహ్లీ లా భారత జర్సీలో .. . మైదానంలోకి దూసుకొచ్చిన ఇంగ్లాండ్ అభిమాని..!

By telugu news teamFirst Published Aug 28, 2021, 11:51 AM IST
Highlights

అతను మరోసారి మైదానంలోకి అడుగుపెట్టి రచ్చ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ కి రావాల్సిన సమయంలో.. నెంబర్ 4 బ్యాట్స్ మెన్ గా .. ఇండియన్ జెర్సీ వేసుకొని.. బ్యాట్ పట్టుకొని.. ఇంగ్లాండ్ అభిమాని జార్వో క్రీజులోకి వచ్చాడు. 
 

టీమిండియా ప్రస్తుతం.. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టు లో విజయం సాధించిన టీమిండియా... మూడో టెస్టులో మాత్రం తడపడుతోంది. అయితే.. ఈ మూడో టెస్టు సమయంలో.. కోహ్లీ బ్యాటింగ్ కి దిగాల్సిన.. ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌ అభిమాని జార్వో చేసిన పని గుర్తుండే ఉంటుంది.  లార్డ్స్‌ టెస్టులో ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో టీమిండియా జెర్సీ వేసుకొని ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. మొదట జార్వోని గుర్తుపట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని బయటికి తీసుకెళ్లారు. భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది.

కాగా.. తాజాగా.. అతను మరోసారి మైదానంలోకి అడుగుపెట్టి రచ్చ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ కి రావాల్సిన సమయంలో.. నెంబర్ 4 బ్యాట్స్ మెన్ గా .. ఇండియన్ జెర్సీ వేసుకొని.. బ్యాట్ పట్టుకొని.. ఇంగ్లాండ్ అభిమాని జార్వో క్రీజులోకి వచ్చాడు. 

“Just the one change, Jarvo 69 comes in for Virat Kohli” 😂

pic.twitter.com/hNnyKUA53c

— Karamdeep (@oyeekd)

అయితే మొదట కోహ్లి వచ్చాడనే భావించిన సెక్యూరిటీ.. తర్వాత  విరాట్ కోహ్లీ కాదని ఆలస్యంగా గుర్తించిన సెక్యూరిటీ అధికారులు జార్వోనూ బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అందరికీ నవ్వులు పూయిస్తునప్పటికీ ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓ అభిమాని ఇలా రెండు సార్లు క్రీజులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.  రెండుసార్లు సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చాడంటే మరేవరైనా వస్త ఆటగాళ్ల రక్షణకి గ్యారెంటీ ఏంటని  అభిమానులు నిలదీస్తున్నారు 

 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తేరుకున్నట్లే కనిపిస్తుంది. 345 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పుజారా 91 నాటౌట్‌, కోహ్లి 45 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు రోహిత్‌ శర్మ 59 పరుగులు చేసి ఔటయ్యాడు.

click me!