పింక్ బాల్ టెస్టు: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ... మూడో వికెట్‌కి విరాట్ కోహ్లీతో కలిసి...

Published : Feb 24, 2021, 09:39 PM IST
పింక్ బాల్ టెస్టు: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ...  మూడో వికెట్‌కి విరాట్ కోహ్లీతో కలిసి...

సారాంశం

63 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ... టెస్టుల్లో 12వ అర్ధశతకం నమోదు... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య 50+ భాగస్వామ్యం...

పింక్ బాల్ టెస్టులో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, టెస్టుల్లో 12వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ...

11 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్, ఆ వెంటనే పూజారా డకౌట్ కావడంతో 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...

PREV
click me!

Recommended Stories

Tilak Varma : టీమిండియా కొత్త ఛేజ్‌మాస్టర్.. కోహ్లీ, ధోనీ రికార్డులు బద్దలు !
ఆక్షన్‌లోకి కొత్త సరుకొచ్చింది బాసూ.! వీళ్ల కోసం గట్టి పోటీ.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?