శుబ్‌మన్ గిల్, పూజారా అవుట్... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

Published : Feb 24, 2021, 08:37 PM IST
శుబ్‌మన్ గిల్, పూజారా అవుట్... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

సారాంశం

ఛతేశ్వర్ పూజారా డకౌట్... 11 పరుగులు చేసి పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్... 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

పింక్ బాల్ టెస్టులో టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.. 51 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 11 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి జాక్ క్రావ్లేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు...

శుబ్‌మన్ గిల్ మొదటి పరుగు చేయడానికి 27 బంతులు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత రెండు ఫోర్లతో ఫామ్‌లోకి వచ్చినా, భారీ షాట్‌కి ప్రయత్నించి, వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత 4 బంతులు ఎదుర్కొన్న ఛతేశ్వర్ పూజారా పరుగులేమీ చేయకుండానే జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. రోహిత్ శర్మ 40 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనితో కలిసి విరాట్ కోహ్లీ నిర్మించే భాగస్వామ్యం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరును నిర్ణయించబోతోంది.  

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?