
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం తెలిసిందే. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, పాకిస్తాన్ లోనూ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, నిజం, పాక్ లోనూ కోహ్లీకి అభిమానులు ఉన్నారు.
ఇటీవల ఆసియా కప్ లో భాగంగా భారత్, పాక్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓ పాక్ యువతి కోహ్లీ కోసం మ్యాచ్ చూడటానికి రావడం విశేషం. సెప్టెంబర్ 2వ తేదీన ఈ మ్యాచ్ జరగగా, వర్షం కారణంగా ఆగిపోయింది. అయితే, ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలో, ఆసియా కప్ ఓపెనర్ మ్యాచ్ గురించి మాట్లాడిన రిపోర్టర్‌తో ఓ మహిళ పాడుతోంది. అందరూ పాకిస్థాన్‌కు జైకొట్టిన వారి చుట్టూ ఉన్న సమయంలో ఆమె విరాట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఆమె తన అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఓ పెద్దాయన అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ మహిళ, "చాచా, పదోసియోం సే ప్యార్ కర్నా కోయి బురీ బాత్ తో నహీ హై (అంకుల్, మీ ఇరుగుపొరుగు వారిని ప్రేమించడం చెడ్డ విషయం కాదు)" అని చెప్పి అతనిని తగ్గించింది.
తర్వాత, విరాట్ , పాకిస్థానీ కెప్టెన్ బాబర్ అజామ్‌లలో ఎవరినైనా ఎంచుకోవాలని రిపోర్టర్ కోరగా ఊహించండి, ఆమె విరాట్ కోహ్లీ ని ఎంచుకోవడం విశేషం. అయితే, పాకిస్తాన్ వారు కొందరు ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేయడం గమనార్హం.