టీమిండియా క్రికెటర్ల జెర్సీపై పాకిస్తాన్ పేరు .. చరిత్రలో ఇదే తొలిసారి, ఎందుకిలా.. ఫోటోలు వైరల్

Siva Kodati |  
Published : Aug 09, 2023, 05:11 PM IST
టీమిండియా క్రికెటర్ల జెర్సీపై పాకిస్తాన్ పేరు .. చరిత్రలో ఇదే తొలిసారి, ఎందుకిలా.. ఫోటోలు వైరల్

సారాంశం

ఆసియా కప్‌లో పాల్గొననున్న టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు రాసి వుండటం దుమారం రేపుతోంది.  ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున భారత జెర్సీపై పాకిస్తాన్ అని రాసి వుంటుంది

భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఎంతటి బద్ధ వైరం వుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని విషయాలలో ఇరు దేశాల మధ్య పోలిక, పోటీ కామన్. ఇక క్రికెట్‌లో రెండు దాయాది దేశాల మధ్య పోరంటే ఆ మజానే వేరు. ఏ ఐసీసీ టోర్నీలోనైనా క్రికెట్ లవర్స్ ఆసక్తిగా గమనించేది ఈ మ్యాచ్ గురించే . మైదానంలోనూ ఇరు దేశాల అభిమానులు సైతం కొట్టుకుంటూ వుంటారు. నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగే ఈ మ్యాచ్‌ను ఎవ్వరూ మిస్ చేసుకోరు.

అలాంటి టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు కనిపిస్తే. వింతగా అనిపించినా.. ఇది నిజం. త్వరలో జరగనున్న ఆసియా కప్ 2023లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పాల్గొననుంది. అయితే భారత జట్టు తమ జెర్సీపై ‘పాకిస్తాన్’ అని రాసే అవకాశం వుంది. పాకిస్తాన్ అనే పేరు రాసి వున్న జెర్సీని ధరించిన భారత క్రికెట్ స్టార్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

ఈ చిత్రాలకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో జరగనున్న ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున భారత జెర్సీపై పాకిస్తాన్ అని రాసి వుంటుంది. టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్ దశలో భారత్ రెండు సార్లు తన చిరకాల ప్రత్యర్ధితో తలపడనుంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరుకుంటే మాత్రం అది ముచ్చటగా మూడో మ్యాచ్ కానుంది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగినా అది అభిమానులకు తక్కువే కదా. 

కాగా.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు జరగబోయే ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్తాన్- నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం అవుతుంది. గ్రూప్ Aలో ఇండియా, పాకిస్తాన్‌తో పాటు ఆసియా కప్ టోర్నీకి తొలిసారిగా అర్హత సాధించిన నేపాల్ పోటీపడుతోంది. గ్రూప్ Bలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీ పడబోతున్నాయి..

కెండీలో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు ఇండియా-  పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. గ్రూప్ స్టేజీలో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 6 నుంచి సూపర్ 4 రౌండ్ మొదలవుతుంది. సెప్టెంబర్ 17న శ్రీలంకలోని రిపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది..

తొలిసారి ఆసియా కప్‌కి అర్హత సాధించిన నేపాల్, సంచలన విజయాలు సాధించకపోతే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందే రెండు మ్యాచులు చూడొచ్చు. సెప్టెంబర్ 4న కెండీలో గ్రూప్ మ్యాచ్‌ ఆడే ఇండియా- పాకిస్తాన్, సెప్టెంబర్ 10న కొలంబోలో సూపర్ 4 మ్యాచులు ఆడతాయి. ఒకవేళ ఈ రెండు జట్లు సూపర్ 4 రౌండ్‌లో టాప్ 2లో నిలిస్తే కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !