పాక్ కొంపముంచిన సర్ఫరాజ్ అహ్మద్... మూడేళ్ల తర్వాత ఆడుతున్నా అదే తీరు..

By Chinthakindhi RamuFirst Published Dec 29, 2022, 4:45 PM IST
Highlights

కేన్ విలియంసన్‌ని అవుట్ చేసే ఛాన్సులను వదిలేసిన సర్ఫరాజ్ అహ్మద్... తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి భారీ ఆధిక్యం... 

పీసీబీ ఛైర్మెన్ పదవి నుంచి రమీజ్ రాజాని తప్పించగానే పాకిస్తాన్ టీమ్‌లోనూ మార్పులు జరుగుతున్నాయి. పాత సెలక్టర్లపై వేటు వేసిన పీసీబీ, మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీని ఛీఫ్ సెలక్టర్‌గా నియమించింది. ఆఫ్రిదీ రాకతోనే మూడేళ్లుగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. టీమ్‌లోకి వచ్చాడు...


మూడేళ్ల తర్వాత టీమ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్ అహ్మద్, బ్యాటుతో అదరగొట్టినా వికెట్ కీపింగ్‌లో మాత్రం పేలవ ప్రదర్శన ఇచ్చి.. జట్టును కష్టాల్లో పడేశాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 612 పరుగుల భారీ స్కోరు చేసింది...

మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన న్యూజిలాండ్, 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టామ్ లాథమ్ 113 పరుగులు చేసి అవుట్ కాగా డివాన్ కాన్వే 92 పరుగులు చేశాడు. హెన్రీ నికోలస్ 22, డార్ల్ మిచెల్ 42, టామ్ బ్లండెల్ 47 పరుగులు చేశారు. ఇష్ సోదీ 65 పరుగులు చేయగా టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్ డకౌట్ అయ్యారు...

కేన్ విలియంసన్ 40+ స్కోరులో ఉన్నప్పుడు స్టంపౌట్ చేసే అవకాశాన్ని నేలపాలు చేశాడు సర్ఫరాజ్ అహ్మద్. రెండు సార్ల్ స్టంపౌట్ చేసే అవకాశాన్ని జారవిడిచిన సర్ఫరాజ్ అహ్మద్, ఓ క్యాచ్‌ని డ్రాప్ కూడా చేశాడు. మొత్తంగా సర్ఫరాజ్ అహ్మద్ చేసిన తప్పిదాలను బాగా వాడుకున్న కేన్ విలియంసన్, మూడేళ్ల భారీ గ్యాప్ తర్వాత సెంచరీ సాధించాడు...

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 161 పరుగులు చేసి అవుట్ కాగా అఘా సల్మాన్ 103 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్ 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి 174 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇంకో రోజు ఆట మిగిలి ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది...

న్యూజిలాండ్ బౌలర్లు తక్కువ స్కోరుకి పాకిస్తాన్‌ని ఆలౌట్ చేయగలిగితే... పాక్‌కి మరో పరాభవం తప్పదు. 74 ఓవర్ల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, 195వ ఓవర్ వరకూ నాటౌట్‌గా నిలిచి డబుల్ సెంచరీతో న్యూజిలాండ్‌కి భారీ స్కోరు అందించాడు...  ఒకవేళ న్యూజిలాండ్ బౌలర్లను పాక్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ వరుస పరాజయాలతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసు నుంచి తప్పుకుంది...

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన పాకిస్తాన్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో వెనకబడింది. 

click me!