45 ఏళ్ల వయసులో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన పాక్ మాజీ క్రికెట్ ఆల్‌రౌండర్ మహ్మద్ హుస్సేన్... ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసిన పాక్ క్రికెట్ బోర్డు...
క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మరణం నుంచి తేరుకోకముందే పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ మహ్మద్ హుస్సేన్ మరణవార్త క్రీడా ప్రపంచాన్ని కలచి వేస్తోంది. పాకిస్తాన్ తరుపున రెండు టెస్టులు, 14 వన్డేలు ఆడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మహ్మద్ హుస్సేన్... మొత్తంగా 16 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఆరంగ్రేటం చేసిన మహ్మద్ హుస్సేన్, ఆస్ట్రేలియాపై ఆఖరి మ్యాచ్ ఆడాడు. 45 ఏళ్ల వయసులో మహ్మద్ హుస్సేన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు 131 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన మహ్మద్ హుస్సేన్, 454 వికెట్లు తీశాడు.
The PCB is saddened by the passing of former Pakistan Test all-rounder Mohammad Hussain and offers its sincerest condolences to his family and friends. pic.twitter.com/f4q4zSUiXj
— Pakistan Cricket (@TheRealPCB)
undefined
మహ్మద్ హుస్సేన్ అకాల మృతిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. ‘పాకిస్తాన్ మాజీ టెస్టు ఆల్‌రౌండర్ మహ్మద్ హుస్సేన్ అకాల మరణవార్త విని, శోకసంద్రంలో మునిగిపోయాం. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం...’ అంటూ ప్రకటన విడుదల చేసింది పాక్ క్రికెట్ బోర్డు...
1997 సెప్టెంబర్‌లో జరిగిన టొరంటో సంఘటనలో మహ్మద్ హుస్సేన్ కూడా ప్రత్యేక్షంగా భాగం పంచుకున్నాడు. టొరంటోలో భారత్, పాకిస్తాన్ మధ్య సహరా కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన శివ్ కుమార్ అనే భారత సంతతి కెనడియన్ వ్యక్తి, అప్పటి పాక్ కెప్టెన్ ఇంజమామ్‌ని బూతులు తిట్టాడు... మెగాఫోన్‌లో ఇంజమామ్‌నా ఆలుగడ్డతో పోలిస్తూ రకరకాల కామెంట్లు చేశాడు.
దీంతో బ్యాటింగ్ చేస్తున్న ఇంజమామ్ వుల్ హక్ తీవ్ర అసహనానికి గురై క్రికెట్ బ్యాటు తీసుకుని శివ్ కుమార్‌పై దాడి చేశాడు. ఈ దాడికి ఉపయోగించిన బ్యాటుని అందించింది మహ్మద్ హుస్సేన్. ఆ మ్యాచ్‌లో 12వ ప్లేయర్‌గా ఉన్న మహ్మద్ హుస్సేన్, టొరంటో సంఘటనకు ప్రత్యేక్ష సాక్షిగా మారాడు... ఈ దాడి తర్వాత ఇంజమామ్ వుల్ హక్‌ని కెనడియాన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఈ కేసు విచారణలో హుస్సేన్ భాగం కావడం జరిగాయి.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, మార్చి 4న గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే... ఆ విషాదం నుంచి క్రికెట్ ప్రపంచం ఇంకా తేరుకోలేదు. క్రికెట్ ప్రపంచంలో స్నేహానికి దేశం, రాష్ట్రం అనే సరిహద్దులు ఉండవు.
52 ఏళ్ల వయసులో షేన్ వార్న్ అకాల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచంలో విషాదం అలుముకుంది. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇప్పటికీ చాలామంది ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి సచిన్ టెండూల్కర్ మెంటర్‌గా వ్యవహరిస్తుంటే... రాజస్థాన్ రాయల్స్‌కి మెంటర్‌గా ఉండేవాడు షేన్ వార్న్. ఈ ఇద్దరూ రోడ్ సేఫ్టీ వరల్డ్ టూర్ సిరీస్ 2021 టోర్నీలోనూ కలిసి పాల్గొన్నారు...