మా రికార్డును భారత జట్టు బ్రేక్ చేసింది, చాలా సంతోషం... పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

Published : Dec 20, 2020, 12:37 PM IST
మా రికార్డును భారత జట్టు బ్రేక్ చేసింది, చాలా సంతోషం... పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

సారాంశం

భయంకరమైన లాస్, అవమానకరమైన బ్యాటింగ్... దేశం సిగ్గు పడే బ్యాటింగ్...   మా చెత్త రికార్డును టీమిండియా బద్ధలుకొట్టింది, అది మాకు చాలా సంతోషంగా ఉంది... విమర్శలు వస్తాయి, భరించక తప్పదు... వీడియో పోస్టు చేసిన షోయబ్ అక్తర్.. 

పింక్ బాల్ టెస్టులో భారత జట్టు ప్రదర్శనతో భారతీయులు షాక్‌తో బాధపడుతుంటే, పాక్ క్రికెటర్లు మాత్రం చాలా సంతోషపడుతున్నారు. భారత జట్టు ఘోరమైన ప్రదర్శన తర్వాత చాలామంది పాకిస్తానీలు, టీమిండియాపై ట్రోల్స్ వినిపిస్తే... ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్... ఓ వీడియో ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

ఓ రకంగా బాధగా ఉందంటూనే, సంతోషంగా ఉందని చెప్పిన అక్తర్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘369...కాదు 36/9... అందులో ఒకరు రిటైర్డ్ హర్ట్... భయంకరమైన లాస్, అవమానకరమైన బ్యాటింగ్... దేశం సిగ్గు పడే బ్యాటింగ్... మా రికార్డు కూడా ఇండియా బద్ధలుకొట్టేసింది... ఇది చాలా టెర్రబుల్.

కానీ మా చెత్త రికార్డును టీమిండియా బద్ధలుకొట్టింది, అది మాకు చాలా సంతోషంగా ఉంది. క్రికెట్‌లో ఇది చాలా సహజం... విమర్శలు వస్తాయి... భరించండి. జరగబోయేది ఇదే.. ఇండియా శక్తివంతంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్.  

 

2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 49 పరుగులకి ఆలౌట్ అయ్యింది పాకిస్తాన్... ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యల్పస్కోరు. టీమిండియా ఆ రికార్డును బద్ధలుకొట్టి, 36 పరుగులకే పరిమితమైంది. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !