మరీ ఇంత నమ్మకం ఏంటయ్యా వార్నర్... టీమిండియా ఫ్యాన్స్‌కి భరోసానిచ్చిన డేవిడ్ భాయ్...

Published : Dec 19, 2020, 05:50 PM IST
మరీ ఇంత నమ్మకం ఏంటయ్యా వార్నర్... టీమిండియా ఫ్యాన్స్‌కి భరోసానిచ్చిన డేవిడ్ భాయ్...

సారాంశం

ఇది కేవలం ఓ గేమ్ మాత్రమే... టీమిండియా మంచి కమ్ బ్యాక్ ఇస్తుంది... సోషల్ మీడియాలో భారత అభిమానులకు భరోసానిచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్...

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్... రెండో వన్డేలో గాయపడి టీ20 సిరీస్‌తో పాటు మొదటి టెస్టు మ్యాచ్‌కి కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ సాధించి బాక్సింగ్ డే టెస్టుతో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న డేవిడ్ వార్నర్... మొదటి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియాకి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

డేవిడ్ వార్నర్ ఫాలోవర్లలో మెజారిటీ శాతం మంది భారతీయులే కావడంతో అతనికి చాలామంది టీమిండియా బ్యాటింగ్ గురించి ప్రశ్నించారు. అందులో ఓ యువతి... ‘ఇండియన్ ఫ్యాన్స్ భారత బ్యాటింగ్‌ను చూసి నమ్మలేకపోతున్నాం.. ఏడుస్తున్నాం...’ అంటూ కామెంట్ చేసింది.

ఆమెకు సమాధానం ఇచ్చిన వార్నర్... ‘ఇది కేవలం ఓ గేమ్. తర్వాతి మ్యాచ్‌లో వాళ్లు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తారు...’ అంటూ భరోసా ఇచ్చారు. డేవిడ్ భాయ్ స్పోర్టివ్ స్పిరిట్‌ రిప్లైకి వేలల్లో లైకులు రావడం విశేషం.

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !