పాక్ టీం పై కరోనా పంజా: ముగ్గురికి పాజిటివ్, నేడు మరికొందరి ఫలితాలు

By Sreeharsha GopaganiFirst Published Jun 23, 2020, 7:52 AM IST
Highlights

హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హారిస్ రవుఫ్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లే ముందు రావల్పిండిలో జరిపిన స్క్రీనింగులో వీరికి కరోనా వైరస్ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది.

పాకిస్తాన్ క్రికెట్ టీంలోని ముగ్గురి క్రికెటర్లకు ఒకేరోజు కరోనా సోకింది. హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హారిస్ రవుఫ్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లే ముందు రావల్పిండిలో జరిపిన స్క్రీనింగులో వీరికి కరోనా వైరస్ ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. వీరికి స్క్రీనింగ్ కి ముందు వరకు, ఫలితాలు వచ్చాక కూడా లక్షణాలు లేవని, వీరందరిని హోమ్ క్వారంటైన్ లో ఉండమని ఆదేశాలిచ్చినట్టుగా తెలిపారు. 

ఈ నెల 28వ తేదీన పాకిస్తాన్ జట్టు మూడు టెస్టులు, మూడు టి20లు ఆడటానికి ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లనుంది. వకార్ యూనుస్, షోయబ్ మాలిక్ ల టెస్టు ఫలితారు నేడు మధ్యాహ్నం కల్లా రానున్నాయని తెలియవస్తుంది. 

పాకిస్తాన్ క్రికెటర్లకు కరోనా సోకడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అంతర్ కాకుండా అందరూ ప్లేయర్స్ కూడా వేర్వేరుగా ప్రాక్టీస్ చేయడం వల్ల వైరస్ అందరికి సోకె ఆస్కారం తక్కువగా ఉందని టీం మానేజ్మెంట్ అభిప్రాయపడింది. 

ఇంగ్లాండ్ లో కూడా సిరీస్ ఆగస్టులో ప్రారంభమవనుంది. సిరీస్ కి దాదాపుగా అయిదు వారాలకు ముందు వెళ్తున్నందున, అక్కడ కూడా బయో సెక్యూర్ బబూల్ వాతావరణంలో ఆడుతున్నందున పెద్ద ఇబంది లేదని అంటున్నారు. 

ఇప్పటికే హారిస్ సోహైల్, అమిర్ సోహైల్ ఇంగ్లాండ్ టూర్ లో ఆడమని చెప్పిన నేపథ్యంలో... ఇప్పుడు మరో ముగ్గురు కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో పాకిస్తాన్ టీం అవకాశాలు దెబ్బతినే ఆస్కారం లేకపోలేదు. 

పాకిస్తాన్ జట్టు మాత్రం ఇప్పుడు కరోనా పాజిటివ్ గా తేలినవారు మ్యాచ్ సమయానికి  కోలుకుంటారని,వారు ఆడే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు. 

ఇప్పటికే గత వారం మాజీ అల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది కరోనా పాజిటివ్ గ తేలాడు. అంతకు ముందు గత నెలలో తౌఫీఖ్ ఉమర్ కరోనా బారిన పది కోలుకున్నాడు. పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ మాత్రం కరోనా బారిన పడి మృతి చెందాడు. 

click me!