శ్రీశాంత్ వచ్చేసాడు: ప్రాబబుల్స్ లో చోటు!

By Sreeharsha GopaganiFirst Published Jun 22, 2020, 7:15 AM IST
Highlights

శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధంఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్నది. దీంతో 37 ఏండ్ల శ్రీశాంత్‌ రంజీ ట్రోఫీలో పునరాగమనానికి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

కళంకిత క్రికెటర్‌, కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌ మళ్లీ మైదానంలో మెరువనున్నాడు. కేరళ జట్టు ప్రకటించిన రంజీ ప్రాబబుల్స్ లో శ్రీశాంత్ కి చోటు దక్కింది.   ఐపీఎల్‌ 2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్‌, న్యాయస్థానంలో సుదీర్ఘ పోరాటం అనంతరం నిషేధాన్ని ఏడేండ్లకు కుదించుకోగలిగాడు. 

శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధంఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్నది. దీంతో 37 ఏండ్ల శ్రీశాంత్‌ రంజీ ట్రోఫీలో పునరాగమనానికి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ నిలిచిపోయింది. దేశవాళీ సీజన్‌ ఆరంభంపై ఎవరికీ స్పష్టత లేదు. అయినా, ముందుస్తు సన్నాహాల్లో భాగంగా కేరళ క్రికెట్‌ సంఘం ఆ రాష్ట్ర రంజీ జట్టు ప్రాబబుల్స్‌ జాబితాను సిద్ధం చేసింది. ఇందులో శ్రీశాంత్ కి చోటు దక్కింది. 

'రానున్న సీజన్‌లో రంజీ ట్రోఫీ సహా ఇతర దేశవాళీ టైటిళ్లు నెగ్గేందుకు కేరళ జట్టుకు ఉపయోగపడటమే నా లక్ష్యం. అవకాశం లభించినప్పుడు మంచి ప్రదర్శనతో జట్టుకు ముందుంచాలని అనుకుంటున్నాను. నాలో ఇంకా సత్తా ఉందని సెలక్టర్లు భావిస్తే, భారత్‌కు సైతం మళ్లీ ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకపోలేదు' అని శ్రీశాంత్‌ తెలిపాడు. 2013 ఇరానీ కప్‌‌లో శ్రీశాంత్‌ చివరి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు.

click me!