
బక్రీద్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసుకున్న పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌కి ఊహించని షాక్ ఇచ్చాడో దొంగ. లాహీర్‌లో ఉన్న తన స్వగ్రామంలో బక్రీద్ వేడుకల కోసం ఆరు మేకలను తీసుకొచ్చాడు పాక్ క్రికెటర్, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్. మేకలను ఇంటి బయట ఓ కర్రకు కట్టేసిన వాళ్లింటి పనివాడు, అక్కడే నిద్రపోయాడట...
అయితే అతను లేచేసరికి,ఇంటి బయట కట్టేసిన ఆరు మేకల్లో ఒకటి కనిపించలేదు... కనిపించకుండా పోయిన మేక చాలా అరుదైన జాతికి చెందిన మేక కావడంతో కమ్రాన్ అక్మల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన ఆ మేక ఖరీదు దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం... మొత్తంగా ఆరు మేకలను 6 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడట కమ్రాన్ అక్మల్..
ఆరు మేకల్లో ఒకే మేక కనిపించకుండా పోవడంతో దాన్ని దొంగలు ఎత్తుకెళ్లారా? లేక తాడు తెంపుకుని పరుగెత్తుకుని వెళ్లిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. బక్రీదు రోజున పేదలకు దానం ఇచ్చేందుకు తీసుకొచ్చిన మేకను పోలీసులు దొంగలు ఎత్తుకుపోవడంతో పాక్ మాజీ క్రికెటర్ పేరు మరోసారి అక్కడ వార్తల్లో నిలిచింది. 2002లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కమ్రాన్ అక్మల్, 2017లో చివరిసారిగా పాకిస్తాన్ తరుపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు...
కమ్రాన్ అక్మల్ సోదరులు అద్నాన్ అక్మల్, ఉమర్ అక్మల్ కూడా క్రికెటర్లుగా రాణించారు. ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజమ్ కూడా కమ్రాన్ అక్మల్‌కి అల్లుడి వరుస అవుతాడు.. పాకిస్తాన్ తరుపున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడిన కమ్రాన్ అక్మల్, మొత్తంగా 11 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 7 వేలకు పైగా పరుగులు చేశాడు...
వికెట్ కీపింగ్‌లో 360 క్యాచులు అందుకున్న కమ్రాన్ అక్మల్, ఐపీఎల్ 2008 సీజన్‌లో టైటిల్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. ప్రస్తుతం పాక్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ తరుపున ఆడుతున్నాడు వికెట్ కీపర్ ప్లేయర్ కమ్రాన్ అక్మల్..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న కమ్రాన్ అక్మల్, పాక్ జట్టులో చోటు కోల్పోయి తిరిగి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చీ రానీ ఇంగ్లీష్‌తో కమ్రాన్ అక్మల్ ఇచ్చే ఇంటర్వ్యూలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ టీమ్‌లో ప్లేస్ దక్కకపోవడంతో పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, ఇంజమామ్ వుల్ హక్ వంటి క్రికెటర్ల దారిలో యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఆదాయాన్ని ఆర్జించే పనిలో పడ్డాడు కమ్రాన్ అక్మల్..