పాక్ క్రికెటర్‌కి మెటర్నిటీ లీవ్... సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ప్రసవ సెలవులను చేర్చనున్న పీసీబీ...

By team teluguFirst Published Apr 17, 2021, 3:37 PM IST
Highlights

పాకిస్తాన్ నుంచి మెటర్నిటీ లీవ్ తీసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచిన బిస్మా మరూఫ్... 

స్టార్ ఆల్‌రౌండర్‌కి ప్రసవ సెలవులు మంజూరు చేసిన పాక్ క్రికెట్ బోర్డు... మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులకు శ్రీకారం...

మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లైన తర్వాత క్రికెట్‌లో కొనసాగడం చాలా కష్టం. అయితే పాక్ క్రికెట్ ఆల్‌రౌండర్ బిస్మా మరూఫ్, మెటర్నిటీ లీవ్ తీసుకుని క్రికెట్‌కి బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెబుతోంది.

పాకిస్తాన్ నుంచి మెటర్నిటీ లీవ్ తీసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది బిస్మా మరూఫ్. దీంతో పాక్ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల సెంట్రాల్ కాంట్రాక్ట్ సిస్టమ్‌లో పెటర్నిటీ లీవ్ చేర్చాలని ప్రయత్నిస్తోంది. 

29 ఏళ్ల మరూఫ్, గత ఏడాది ఫిబ్రవరిలో చివరిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. పాక్ మహిళా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మరూఫ్, పాక్ తరుపున అత్యధిక వన్డే మ్యాచులు ఆడిన రెండో ప్లేయర్‌గా కూడా నిలిచింది.

108 వన్డేల్లో 2602 పరుగులు చేసిన మరూఫ్, టీ20ల్లో 2225 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన పాక్ వుమెన్ క్రికెటర్‌గా ఉంది. పాక్ కెప్టెన్‌గా వ్యవహారించిన మరూఫ్ టీ29 వరల్డ్‌కప్ సమయంలో కుటుంబ కారణాలతో జట్టుకి దూరమైంది. దాంతో పాక్ వుమెన్స్ టీమ్ కెప్టెన్సీ జవేరియా ఖాన్‌కి దక్కింది.
 

click me!