స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాను...నన్ను క్షమించి వదిలేయండి: పాక్ క్రికెటర్

By Arun Kumar PFirst Published Aug 20, 2019, 2:30 PM IST
Highlights

స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి రెండున్నరేళ్లపాటు క్రికెట్ నుండి నిషేదించబడ్డ పాకిస్థాన్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ తిరిగి అంతర్జాయ క్రికెట్ ఆడనున్నాడు. అతడిపై విధించిన నిషేదం ముగియడంతో తిరిగి కెరీర్ ను కొనసాగించేందుకు పిసిబి అనుమతిచ్చింది.  

పాకిస్థాన్ క్రికెట్ లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.  2017 లో దుబాయ్ వేదికన జరిగిన పాకిస్థాన్ క్రికెట్ లీగ్(పిసిఎల్)లో ఫిక్సింగ్ కు పాల్పడ్డ పాక్ ప్లేయర్ షర్జీల్ ఖాన్ రెండేళ్ల నిషేదాన్ని పూర్తిచేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తిరిగి అంతర్జతీయ కెరీర్ ను  కొనసాగించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుమతిచ్చింది.

పిసిబి విధించిన రెండునరేళ్ల నిషేద కాలం ముగియడంతో పాక్ ఓపెనర్ షర్జీల్ పిసిబి అధికారులను కలిశాడు. సోమవారం బోర్డు అవినీతి నిరోదక శాఖ అధికారులను కలిసి మళ్లీ ఇలాంటి తప్పు చేయనని...దయచేసి తనను క్షమించాలని  కోరినట్లు సమాచారం. ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా బోర్డుకు క్షమాపణలు కోరుతూ ఓ లేఖ  అందించాడు. 

తన వల్ల ఇబ్బందులపాలైన పిసిబిని క్షమించమని  కోరుతున్నా. అలాగే తన సన్నిహితులు, స్నేహితులు,  బందువులు, కుటుంబసభ్యులు కూడా తాను చేసిన పనివల్ల అవమానాలు ఎదుర్కొన్నారు. వారందరు తనను క్షమించాలని...ఇకపై బాద్యతాయుతంగా మెలిగి దేశ ప్రతిష్టను కాపాడేలా వ్యవహరిస్తానని షర్జీల్ పిసిబికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. 

అతడి అభ్యర్థనను మన్నించి తిరిగి అతన్ని అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు  అనుమతిచ్చినట్లు పిసిబి తెలిపింది. అయితే  కొంతకాలం అతడు రిహాబిటేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సి వుంటుందని వెల్లడించింది. ఆ తర్వాతే జాతీయ జట్టులో ఆడేందుకు అనుమతి వుంటుందని పిసిబి అధికారులు  తెలిపారు. 

2017  లో జరిగిన పిసిఎల్ సీజన్ 2లో కొందరు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు పిసిబి అవినీతి నిరోదక విభాగం గుర్తించింది. పాక్ జాతీయ క్రికెటర్లు షర్జీల్‌ ఖాన్‌, ఖలీద్‌ లతీఫ్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, షాజైబ్‌ హసన్‌, నాసిర్‌ జెంషెడ్‌ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిలో ఓపెనర్ షర్జీల్ ఖాన్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేలడంతో అతడిని అంతర్జాతీయ క్రికెట్ నుండి మొదట ఐదేళ్లు నిషేధించారు. ఆ తర్వాత నిషేధాన్ని రెండున్నరేళ్లకు కుదించింది. ఇటీవల ఈ నిషేద గడువు పూర్తవడంతో తిరిగి షర్జీల్ కెరీర్‌ కొనసాగించేందుకు  పిసిబి అవకాశమిచ్చింది. 

 

click me!