అప్పుడు నా దగ్గరకు ధోనీ తప్ప ఒక్కరు కూడా రాలేదు.. బుమ్రా

By telugu news teamFirst Published Feb 25, 2020, 11:33 AM IST
Highlights

తాజాగా.. క్రిక్ బజ్ స్పైసీపిచ్ కార్యక్రమంలో బుమ్రా మాట్లాడాడు. తన అరంగేట్రం నాటి విషయాలను కూడా బుమ్రా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన వద్దకు ఎవరూ రాలేదని.. ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని గుర్తు చేసుకున్నాడు.

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో.. బుమ్రా ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి టెస్టులో 88 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసిన బుమ్రా.. గాయం నుంచి కోలుకున్నాక ఫామ్ కోల్పోయి సతమతమౌతున్నాడు.

గత మూడేళ్లుగా కీలక బౌలర్ గా రాణిస్తున్న బుమ్రా.. గతేడాది వెన్నునొప్పితో బాధపడుతూ శస్త్ర  చికిత్సచేయించుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అయితే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత పెద్దగా రాణించడంలేదనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.

Also Read టీమిండియా ఘోర పరాభవం.. ఆసిస్ మాజీ క్రికెటర్ చురకలు...

తాజాగా.. క్రిక్ బజ్ స్పైసీపిచ్ కార్యక్రమంలో బుమ్రా మాట్లాడాడు. తన అరంగేట్రం నాటి విషయాలను కూడా బుమ్రా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన వద్దకు ఎవరూ రాలేదని.. ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని గుర్తు చేసుకున్నాడు.

కేవలం మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే తన వద్దకు వచ్చాడని.. తనను తనలాగే ఉండమని చెప్పి.. ఆటను ఆస్వాదించాలని ప్రోత్సహించాడని బుమ్రా గుర్తు చేశాడు. మరోవైపు న్యూజిలాండ్ తో తొలి టెస్టుకు ముందు మూడు వన్డేలు ఆడిన టీమిండిాయ ప్రధాన పేసర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

ఈ నేపథ్యంలోనే సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ తొలి టెస్టు రెండో రోజు అతడికి మద్దతుగా నిలిచాడు. బుమ్రా సామర్థ్యంపై ఎవరూ సందేహించాల్సిన అసవరం లేదని.. అతను అరంగేట్రం నాటి నుంచి టీమిండియా చాలా చేశాడని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. 

click me!