మూడో టీ20 నుంచి స్టేడియం గేట్లు బంద్... అహ్మదాబాద్‌లో ప్రేక్షకులు లేకుండానే మిగిలిన మ్యాచులు...

By team teluguFirst Published Mar 16, 2021, 2:56 PM IST
Highlights

గత కొన్నిరోజులుగా గుజరాత్‌తో పాటు అహ్మదాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు...

ముందు జాగ్రత్త చర్యగా మిగిలిన మూడు టీ20లను ప్రేక్షకులు లేకుండా నిర్వహించేందుకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం...

మూడో టెస్టు మ్యాచ్ నుంచి మొదటి రెండు టీ20లను స్టేడియంలో తిలకించిన ప్రేక్షకులకు గుజరాత్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గుజరాత్ రాష్ట్రంతో పాటు అహ్మదాబాద్‌ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగబోయే మిగిలిన మూడు టీ20 మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించడం లేదు.

ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌తో పాటు మొదటి రెండు టీ20 మ్యాచులు తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చారు ప్రేక్షకులు.

గత రెండు టీ20 మ్యాచులకు 60 వేలకు పైగా అభిమానులు స్టేడియానికి తరలిరావడం విశేషం. చెన్నైలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించింది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. ఆ తర్వాత రెండో టెస్టు నుంచి మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం దొరికింది.

click me!